News March 18, 2024
సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసిన శ్రీకాకుళం ఎస్పీ

జిల్లా సరిహద్దుగా ఉన్న కంచిలి మండలంలో గాటి ముకుందపురం, ఇచ్ఛాపురం మండలంలో పురుషోత్తపురం అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను సోమవారం రాత్రి జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక, అదనపు ఎస్పీ జి.ప్రేమ కాజల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల రాకపోకలు, తనిఖీలను కాసేపు పరిశీలించి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున చెక్ పోస్టు సిబ్బంది ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News March 16, 2026
శ్రీకాకుళం: రెండు నెలల్లో.. ఐదు బ్యాంకు ఉద్యోగాలు..!

శ్రీకాకుళం జిల్లా గార మండలం జొన్నలపాడుకు చెందిన ఎం. స్వప్న అసాధారణ ప్రతిభతో ఆదర్శంగా నిలిచారు. వివాహం తర్వాత అత్తవారి ఇంట్లో ఉంటూనే పట్టుదలతో చదివి, కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఐదు బ్యాంకు ఉద్యోగాలను సొంతం చేసుకున్నారు. ఇందులో రెండు PO పోస్టులు, రెండు క్లర్క్ పోస్టులు, ఒక జూనియర్ అసోసియేట్ ఉద్యోగం ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన స్వప్న, తన విజయంతో మహిళల ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పారు.
News March 16, 2026
బూర్జ: టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం

టిప్పర్ ఢీకొని ద్విచక్రవాహనదారుడు మృతి చెందిన ఘటన బూర్జ మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. ఉప్పినివలస గ్రామానికి చెందిన జీవన్ కుమార్ (32) తన పనులను ముగించుకొని కొల్లివలస నుంచి స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొని తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసు కేసు నమోదైంది.
News March 16, 2026
శ్రీకాకుళం: పది పబ్లిక్ పరీక్షలు.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!

జిల్లాలో నేడు ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలను అధికారులు విడుదల చేశారు. పరీక్షకు ముందే OMR షీట్ పై ఫోటో, పేరు, రోల్ నంబర్ సరిచూసుకోవాలి. విద్యార్థులకు 24 పేజీల మెయిన్ బుక్లెట్, అవసరమైతే 12 పేజీల అదనపు బుక్లెట్ అందిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి పెన్నులకు మాత్రమే అనుమతి ఉంటుంది. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు వంటి వస్తువులను కచ్చితంగా నిషేధించారు.


