News January 31, 2025
అనకాపల్లి: ఆ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ..!

ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు పోటీకి సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో ప్రధానంగా ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, కోరెడ్ల విజయ్ గౌరి మధ్య పోటీ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పీఆర్టీయు తరఫున శ్రీనివాసులు నాయుడు, ఏపీటీఎఫ్ తరపున రఘువర్మ, పీడీఎఫ్ నుంచి విజయగౌరి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాగా.. ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి మద్ధుతిస్తాయో చూడాలి.
Similar News
News March 2, 2025
ఏపీ రాజకీయాలపై వెబ్ సిరీస్.. చంద్రబాబు పాత్రలో నటించేది ఎవరంటే?

సామాజిక అంశాలను కథా వస్తువులుగా తెరకెక్కించే దర్శకుడు దేవ కట్టా ఓ వెబ్ సిరీస్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YSR, సీఎం చంద్రబాబు స్నేహం గురించి ఈ కథ ఉంటుందని సమాచారం. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కే ఈ సిరీస్‌లో చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి, వైఎస్ఆర్ రోల్‌లో చైతన్య రావు నటిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News March 2, 2025
IPLను బాయ్‌కాట్ చేయాలని ఇంజమామ్ పిలుపు

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ IPLపై విషం కక్కారు. IPLను బాయ్‌కాట్ చేయాలని ఇతర దేశాల క్రికెట్ బోర్డులకు పిలుపునిచ్చారు. ‘భారత క్రికెటర్లు ఏ ఇంటర్నేషనల్ లీగ్‌లలో పాల్గొనరు. కానీ ప్రపంచంలోని టాప్ ప్లేయర్లందరూ IPL ఆడతారు. భారత ప్లేయర్లు ఫారిన్ లీగ్స్ ఆడే వరకు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు తమ క్రికెటర్లను ఐపీఎల్ ఆడేందుకు ఇండియాకు పంపొద్దు’ అని వ్యాఖ్యానించారు.
News March 2, 2025
జగిత్యాల కలెక్టరేట్‌లో శ్రీపాదరావు జయంతి

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం మాజీ స్పీకర్ దుద్ధిల్ల శ్రీపాద రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య ప్రసాద్ తదితర అధికారులు శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్‌లత తదితరులు పాల్గొన్నారు.