News January 31, 2025
తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన

AP: తల్లికి వందనం(విద్యార్థికి ₹15,000), అన్నదాత సుఖీభవ(రైతుకు ₹20,000)పథకాలను ఈ ఏడాదే ప్రారంభించనున్నట్లు చంద్రబాబు TDP పొలిట్‌బ్యూరో భేటీలో ప్రకటించారు. అన్నదాత-సుఖీభవను 3 విడతల్లో చెల్లిస్తామన్నారు. AP ఆదాయం పెంచే మార్గాలు వెతుకుతున్నట్లు పేర్కొన్నారు. గోదావరి నీళ్లు రాయలసీమకు తరలించేలా చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టును ప్రభుత్వం, కాంట్రాక్టర్లు భరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News October 20, 2025
దేశంలో యూపీఐ ద్వారానే 85% డిజిటల్ చెల్లింపులు: RBI

ఇండియాలో 85శాతం డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. UPI దేశ డిజిటల్ ఎకానమీలో విప్లవమని వరల్డ్ బ్యాంక్, IMF సమావేశాల్లో పేర్కొన్నారు. ప్రతి నెలా 20 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయన్నారు. యూపీఐ కేవలం ఆర్థిక సాధనం మాత్రమే కాదని, సామాజిక, ఆర్థిక సమానత్వానికి సూచిక అని అభిప్రాయపడ్డారు. యూపీఐ పరిధి దేశాలు దాటిందని వివరించారు.
News October 20, 2025
దీపావళి: ఈ నియమాలు పాటిస్తున్నారా?

దీపావళి రోజున చేసే లక్ష్మీదేవి పూజలో ఇనుప వస్తువులు వాడకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది నెగటివ్ శక్తిని పెంచుతుందని అంటున్నారు. ‘నేడు ఉల్లి, వెల్లుల్లి, గుడ్లు, మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. ఇంట్లో ఆడవారిని ఎట్టి పరిస్థితుల్లో బాధపెట్టకూడదు. ఈ రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఇంట్లో బూజు దులపకూడదు. తులసి ఆకులు కోయకూడదు. ఇలా ఇస్తే.. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్తుంది’ అని చెబుతున్నారు.
News October 20, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. ఆర్జిత సేవలు రద్దు

AP: దీపావళి పండుగ వేళ తిరుమలలో రద్దీ నెలకొంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల వరకు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 84,017 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.97 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఇవాళ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు.