News March 19, 2024

TODAY HEADLINES

image

* బీజేపీకి అధికారమిస్తే TGను మరింత అభివృద్ధి చేస్తాం: మోదీ
* TG: గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
* దళిత బంధుతో ఎదురుదెబ్బ: కేసీఆర్
* BRSలో చేరిన ప్రవీణ్ కుమార్
* AP: అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది: జగన్
* జగన్ కుల, మత రాజకీయాలపై పడ్డారు: CBN
* ‘ప్రజాగళం’ పూర్తిగా విఫలం: సజ్జల
* లిక్కర్ స్కామ్‌లో 15 మంది అరెస్టు: ఈడీ

Similar News

News July 8, 2024

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఈరోజు ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్ 36 పాయింట్ల నష్టంతో 79,960 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 24,320 (-3.30) వద్ద ట్రేడింగ్ ముగించింది. FMCG, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ 0.6-1.5% వృద్ధి చెందాయి. అయితే ఆటో, బ్యాంకింగ్, హెల్త్ కేర్, మెటల్, రియల్టీ, పవర్, టెలికాం రంగాలు 0.4-0.8% క్షీణించడం మార్కెట్‌పై ప్రభావం చూపింది.

News July 8, 2024

‘నీట్’పై విచారణ గురువారానికి వాయిదా

image

‘నీట్’ పేపర్ లీకేజీపై విచారణను సుప్రీంకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇవాళ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పేపర్ లీకైన మాట వాస్తవమే. లీకేజీతో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అధికారులు అంటున్నారు. కానీ ఎంతమందికి చేరిందన్నది గుర్తించలేదు. అన్నీ జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తాం’ అంటూ విచారణను వాయిదా వేసింది.

News July 8, 2024

రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన?

image

తెలంగాణ సీఎం రేవంత్ రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. తొలుత తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో పర్యటించాలని ఆయన నిర్ణయించారట. రేపు ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.