News January 31, 2025
సంగారెడ్డి: ‘విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలి’

సంగారెడ్డిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. గురుకుల పాఠశాలలో ఉన్న బియ్యం, కూరగాయలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ దేవదాస్, RCO గౌతమ్ పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
తిరుమలలో అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పు

అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పడు అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి FIFO (First In First Out) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయి. ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.
News November 6, 2025
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2025కు సిద్ధం కావాలి: చీఫ్ ఎలక్టోరల్ అధికారి

కర్నూల్ జిల్లాలో ఓటర్ల జాబితా లోపరహితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డా.ఏ.సిరి, అధికారులు పాల్గొన్నారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్‌లుగా నమోదు చేయాలన్నారు. డూప్లికెట్, చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
News November 6, 2025
మదనపల్లెలో నిలకడగా టమాటా ధరలు

మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు నిలకడగా ఉన్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటి సెక్రటరీ జగదీశ్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌కు 165 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకువచ్చారన్నారు. హోల్ సేల్ వ్యాపారులు 10 కిలోల మొదటి రకం టమాటా బాక్స్‌ను రూ.270, రెండవ రకం రూ.250, మూడవ రకం రూ.210 కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు. రేట్లు ఇలానే ఉండాలని రైతులు కోరుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు.


