News January 31, 2025
UGC నెట్ ప్రిలిమినరీ కీ విడుదల

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హత కోసం నిర్వహించే UGC నెట్ పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదలైంది. జనవరిలో ఈ పరీక్ష నిర్వహించారు. కీ పట్ల అభ్యంతరాలుంటే ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించి FEB 3వ తేదీ సా.6 గంటల వరకు ఛాలెంజ్ చేయవచ్చు. అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, DOB, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీ కోసం ఇక్కడ <
Similar News
News January 12, 2026
బెర్క్‌షైర్ హాత్వే కొత్త CEOకి భారీ వేతనం

వారెన్ బఫెట్ <<18720997>>పదవీ విరమణ<<>> అనంతరం బెర్క్‌షైర్ హాత్వే కొత్త CEOగా గ్రెగ్ అబెల్ బాధ్యతలు చేపట్టారు. 2026 సంవత్సరానికి ఆయన వార్షిక వేతనం 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.208 కోట్లు)గా నిర్ణయించారు. ఇది గతంతో పోలిస్తే 19 శాతం ఎక్కువ కావడం విశేషం. బఫెట్ కంటే ఎక్కువ వేతనం పొందడం చర్చనీయాంశంగా మారింది. వైస్ ఛైర్మన్‌గా సేవలందించిన అబెల్, ఇప్పుడు బెర్క్‌షైర్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు.
News January 12, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 12, 2026
డింపుల్ హయాతి దాసరి మనవరాలని తెలుసా?

డింపుల్ హయాతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను డైరెక్టర్ దాసరి నారాయణరావు మనవరాలినని వెల్లడించారు. రవితేజతో కలిసి నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రమోషన్స్‌లో ఈ విషయం చెప్పారు. ‘దాసరి నారాయణరావు గారు మా తాతకు కజిన్. మా నానమ్మ ప్రభ కిక్ మూవీలో హీరో తల్లిగా చేశారు. నన్ను ఇలియానాకు చెల్లిగా చేయమన్నారు. అప్పుడు నేను ఫోర్త్ క్లాస్. అందుకే పేరెంట్స్ వద్దన్నారు. తర్వాత చాలా ఫీలయ్యారు’ అని తెలిపారు.


