News January 31, 2025

కడపలో టీడీపీ ‘మహానాడు’

image

AP: ఈ ఏడాది TDP ‘మహానాడు’ కడపలో నిర్వహించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. అలాగే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు మహానాడు‌లోపు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. చంద్రబాబు అధ్యక్షతన నాలుగున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీలో YCP చేసిన జిల్లాల పునర్విభజనను సరిదిద్దాలని కూడా చర్చించారు. అటు పద్మభూషణ్ వచ్చిన బాలకృష్ణకు పొలిట్‌బ్యూరో సభ్యులు అభినందనలు తెలిపారు.

Similar News

News November 3, 2025

సర్పాలు, నాగులు ఒకటి కాదా?

image

పురాణాల ప్రకారం.. సర్పాలు, నాగులు వేర్వేరని పండితులు చెబుతున్నారు. సర్పాలంటే భూమిపై తిరిగే పాములని, నాగులంటే దైవ స్వరూపాలని అంటున్నారు. ‘సర్పాలు విషపూరితమైనవి. నాగులు విషరహితమైనవి. నాగులు కోరుకున్న రూపాన్ని ధరించగలవు. అలాగే వీటికి ప్రత్యేకంగా ‘నాగ లోకం’ కూడా ఉంది. ఇవి గాలిని పీల్చి జీవిస్తాయి. కానీ సర్పాలు నేల/నీటిలో మాత్రమే ఉంటాయి. ఇవి నేలను అంటిపెట్టుకొని పాకుతాయి’ అని వివరిస్తున్నారు.

News November 3, 2025

రూ.500కే రూ.16 లక్షల ప్లాటు గెలిచింది

image

TG: లాటరీలో ఓ 10 నెలల చిన్నారిని అదృష్టం వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో తీసిన లక్కీ డ్రాలో రూ.500కే ఏకంగా రూ.16 లక్షల విలువైన ప్లాటును గెలుచుకుంది. రామ్ బ్రహ్మచారి అనే వ్యక్తి 66 గజాల ప్లాటుకు లక్కీ డ్రా నిర్వహించారు. శంకర్ అనే వ్యక్తి ఫ్యామిలీ పేరుతో 4 కూపన్లు తీసుకోగా.. 2307 అనే నంబరుతో కుమార్తె హన్సికకు ఈ బహుమతి దక్కింది. రూ.500కే ప్లాటు దక్కడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.

News November 3, 2025

Take A Bow: మనసులు గెలిచిన కెప్టెన్ లారా

image

భారత్ ఉమెన్స్ WCను లిఫ్ట్ చేసినప్పుడు గెలుపు గర్జనతో స్టేడియం మారుమోగింది. అంతా విజయోత్సాహంలో నిండిపోయారు. కానీ, SA కెప్టెన్ లారా ముఖంలో విషాదం నిండిపోయింది. ఫైనల్లో సెంచరీ సహా 9 మ్యాచుల్లో 571 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచారు. అయినా SAకి తొలి WC అందించాలన్న తన కల సాకారం కాలేదు. అయితే ఆమె పోరాటం క్రికెట్ అభిమానుల మనసులు గెలిచింది. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ లారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.