News January 31, 2025
నీలంరాజుకు GOLD మెడల్.. లోకేశ్ అభినందనలు

AP: ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ నేషనల్ గేమ్స్‌లో గుంటూరుకు చెందిన నీలంరాజు సత్తా చాటారు. వెయిట్ లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో తొలిస్థానంలో నిలిచి గోల్డ్‌మెడల్ సాధించారు. దీంతో నీలంరాజును మంత్రి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా అభినందించారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గర్వించదగ్గ విషయం అని కొనియాడారు. భవిష్యత్తులో మరింతగా రాణించి పలువురికి ఆదర్శంగా నిలవాలని లోకేశ్ పేర్కొన్నారు.
Similar News
News January 3, 2026
మరోసారి తండ్రి అయిన టాలీవుడ్ హీరో

టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ మరోసారి తండ్రి అయ్యారు. జనవరి 2న ఆయన భార్య అరుణ మగ బిడ్డకు జన్మనిచ్చారని సినీ వర్గాలు తెలిపాయి. చాలా కాలం తర్వాత ‘శంబాల’తో హిట్ అందుకున్న ఆయనకు సంతోషం రెట్టింపు అయింది. 2014లో ఆది, అరుణ వివాహం జరగ్గా, వారికి ఓ పాప ఉంది. కాగా శంబాల మూవీ వారం రోజుల్లో రూ.16.2 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
News January 3, 2026
కంది పండితే కరువు తీరుతుంది

మన భోజనంలో కందిపప్పు ప్రధానమైనది. ఇది బాగా పండితే ప్రతి ఇంట్లో నిల్వ ఉండి ఇతర కూరగాయలు లేకపోయినా పప్పు లేదా పప్పుచారుతో కడుపు నింపుకోవచ్చు. అలాగే కంది వర్షాభావ పరిస్థితులను, కరువును తట్టుకుని నిలబడి కరువు కాలంలో రైతుకు భరోసానిస్తుంది. పర్యావరణం పరంగా కంది పంట వల్ల భూమికి నత్రజని అంది నేల సారవంతమై తదుపరి పంటలకు మేలు జరుగుతుంది. ఇన్ని లాభాల వల్లే కంది పండితే కరువు తీరుతుంది అంటారు.
News January 3, 2026
గుడికి వెళ్లినప్పుడు నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి?

శివాలయాలు, హనుమాన్ దేవాలయాలకు వెళ్లినప్పుడు ముందుగా ఆ ఆలయంలోని ప్రధాన దైవాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాతే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శాస్త్రాల ప్రకారం మూలవిరాట్టును దర్శించి బయటకు వచ్చాక నవగ్రహ మండపం వద్దకు వెళ్లి పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయ్యాక మరోసారి ప్రధాన దైవాన్ని దర్శించుకుని, ఆపై ఇంటికి వెళ్లడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.


