News January 31, 2025
రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎల్లుండి అక్కడి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఢిల్లీలో తెలుగు అసోసియేషన్స్, తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. రేపు ఉదయం ఆయన అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.
Similar News
News March 3, 2025
వెయ్యి మందిని తొలగిస్తున్న ఓలా ఎలక్ట్రిక్!

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వెయ్యికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లను తొలగించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. నష్టాలను తగ్గించుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. దాదాపుగా అన్ని శాఖలపై ఈ ప్రభావం పడనుంది. ప్రస్తుతం కంపెనీలో 4000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2023, NOVలోనూ ఓలా 500 మందిని తీసేసింది. నష్టాలు, మార్కెట్ కరెక్షన్ వల్ల 60% తగ్గిన ఓలా షేర్లు ప్రస్తుతం రూ.55 వద్ద కొనసాగుతున్నాయి.
News March 3, 2025
రోహిత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు: బీసీసీఐ

రోహిత్‌శర్మపై కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ జరుగుతున్న వేళ బాధ్యతాయుతమైన వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఆటగాళ్లందరూ అద్భుతంగా ఆడుతున్నారని దాని ఫలితాలు కూడా చూస్తున్నామని తెలిపారు. వ్యక్తిగత ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని హితవు పలికారు.
News March 3, 2025
SEBI మాజీ చీఫ్, BSE అధికారులకు స్వల్ప ఊరట

మార్కెట్ అవకతవకలు, కార్పొరేట్ మోసం కేసులో SEBI, BSE అధికారులపై ACB FIR ఫైల్ చేయాలన్న ముంబై సెషన్స్ కోర్టు ఆదేశాలను బాంబే హైకోర్టు నిలిపివేసింది. ముందస్తుగా నోటీసులు ఇవ్వకపోవడంతో సెషన్స్ కోర్టు ఆదేశాలు చెల్లుబాటు కావన్న రెస్పాండెంట్స్ లాయర్ల వాదనను అంగీకరించింది. TUE వాదనలు వింటామంది. సెబీ మాజీ చీఫ్ మాధబీ, మెంబర్లు అశ్వనీ, అనంత్, కమలేశ్, BSE ఛైర్మన్ ప్రమోద్, CEO సుందర రామన్‌కు ఊరటనిచ్చింది.