News February 1, 2025
ఈ స్కూల్లో ఏడాదికి రూ.27లక్షలు ఫీజు!
ప్రస్తుతం నాణ్యమైన విద్యను పొందాలంటే రూ.లక్షలు ఖర్చు చేయాల్సిందే. నర్సరీ పిల్లలకు సైతం కొందరు రూ.4-5 లక్షలు వసూలు చేస్తున్నారు. UAEలో ఉండే గ్లోబల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ పాఠశాలలో స్టార్టింగ్ ఫీజే రూ.27లక్షలుగా ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు. కేరళకు చెందిన మరియమ్మ, KS వర్కీ 1968లో UAEలో ఈ విద్యాసంస్థను ప్రారంభించి అమెరికా, ఇండియా, ఇంగ్లండ్కూ విస్తరించారు.
Similar News
News February 1, 2025
నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలు
AP: నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. దీంతో కొత్త ఛార్జీలు తప్పించుకునేందుకు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 14250 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రోజుకు 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో దాదాపు 170 వరకు జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కార్కు ఏకంగా రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది.
News February 1, 2025
నేడే కేంద్ర బడ్జెట్
ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో రైతులు, పేదలు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి బడ్జెట్లో పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది.
News February 1, 2025
ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారా?
ఉద్యోగులకు ఏసీ ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం అలవాటైపోయింది. కానీ ఇది తీవ్రమైన వ్యాధులకు దారి తీయొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటలపాటు ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు పెరగడం, మధుమేహం వస్తుంది. నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. మెడ, వెన్ను నొప్పి వస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, డిప్రెషన్, అల్జీమర్స్, రక్తపోటు, పక్షవాతం వ్యాధి వచ్చే అవకాశం ఉంది.