News February 1, 2025
NGKL: ‘నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహించాలి’

ఫిబ్రవరి 10న జరిగే నూలి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన నూలి పురుగుల నిర్మూలన దినోత్సవానికి సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారి స్వరాజ్యలక్ష్మితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 4, 2025
ADB: ‘రేపు పత్తి కొనుగోళ్లు బంద్’

ఈనెల 5వ తేదీన గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పత్తి కొనుగోలు నిలిపివేశామని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మంగళవారం తెలియజేశారు. ఈనెల 6 నుంచి కొనుగోలు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు కోరారు.
News November 4, 2025
ఉమ్మడి మెదక్ జిల్లా ఖోఖో జట్ల ఎంపిక

తూప్రాన్ గురుకులంలో రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ జట్లను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు హరికిషన్, శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 150 మంది హాజరు కాగా, 15 మంది పురుషులు, 15 మంది మహిళలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి పెద్దపల్లిలో రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని వివరించారు.
News November 4, 2025
విశాఖ: మనస్తాపంతో CA విద్యార్థి ఆత్మహత్య

సీఏ చదువుతున్న విద్యార్థి విశాఖలో ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ సీఐ ఎర్రంనాయుడి వివరాల ప్రకారం.. CA విద్యార్థి అఖిల్ వెంకట వంశీ ఆరిలోవలో నివాసం ఉంటున్నాడు. అన్ని పరీక్షలు పాస్ అయినట్లు ఇంట్లో అబద్దం చెప్పినందుకు మనస్తాపం చెందాడు. దీంతో పరీక్షల నిమిత్తం కొబ్బరి తోటలో తీసుకున్న రూమ్ వద్దే మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.


