News February 1, 2025
HYDలో రూ. 50కే డోర్ డెలివరీ!
HYDలో ఎక్కడికైనా కేవలం రూ.50కే కిలో వరకు బరువు కలిగిన సామగ్రిని డోర్ డెలివరీ చేస్తున్నట్లు ఆర్టీసీ కార్గో అధికారులు తెలిపారు. నగరవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వస్తువు బరువు ప్రకారం ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, ఎల్బీనగర్ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా కార్గో కౌంటర్లు ఏర్పాటు చేశారు.SHARE IT
Similar News
News February 1, 2025
సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు.. 3 రోజులే అవకాశం
SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో 31, సికింద్రాబాద్ డివిజన్లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
SHARE IT
News February 1, 2025
HYD: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్
కేసీఆర్ రేవంత్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామని అన్నారు. ఇంకా ఫామ్ హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా.. లేదా అసెంబ్లీకి వస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా ఎక్కడికి పోతాడో చూద్దామని అన్నారు. అసెంబ్లీకి వస్తే అప్పుడు మాట్లాడతామని అన్నారు.
News February 1, 2025
HYD: సీఎం రేవంత్ మిస్ గైడెడ్ మిసైల్‌లా పనిచేస్తున్నారు: కవిత
నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తున్నదని.. నీళ్ల విషయంలో రాజకీయాలు చేయడం మానేసి నిజాలు చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో నీళ్లు-నిజాలు అంశంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కవితతోపాటు మేధావులు, విశ్రాంత ఇంజినీర్లు పాల్గొన్నారు. సీఎం రేవంత్ మిస్ గైడెడ్ మిసైల్‌లా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.