News February 1, 2025

దిన‌స‌రి వేత‌నం రూ.300 అందాల్సిందే: క‌లెక్ట‌ర్

image

జాతీయ గ్రామీణ ఉపాధి హ‌మీ ప‌థ‌కం ద్వారా కూలీలు దిన‌స‌రి స‌గ‌టు వేత‌నం రూ.300 హ‌క్కుగా పొందేలా క్షేత్ర‌స్థాయి అధికారులు, సిబ్బంది స‌రైన ప్ర‌ణాళిక‌తో ప‌నులు చేప‌ట్టేలా వ్య‌వ‌హ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ఉపాధి హామీ ప‌థ‌కం, చెత్త నుంచి సంప‌ద సృష్టి కేంద్రాలు, పెన్ష‌న్ల పంపిణీ త‌దిత‌రాల‌ అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. 

Similar News

News November 5, 2025

బ్యాంకులకు ధీటుగా ఆన్లైన్ సేవలు అందిస్తాం: గన్ని వీరాంజనేయులు

image

ఏలూరు క్రాంతి కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహా జనసభను డీసీసీబీ సీఈఓ సింహాచలం అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వంతో సిబ్బంది కుమ్మక్కై సహకార సంఘాన్ని నష్టాల బాట పట్టించారని తీవ్రంగా విమర్శించారు. 2 నెలల్లో కమర్షియల్ బ్యాంకులకు దీటుగా ఆన్లైన్ సేవలు అందిస్తామన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

News November 5, 2025

మగాళ్లకూ పీరియడ్స్ వస్తే అమ్మాయిల బాధ అర్థమవుతుంది: రష్మిక

image

జగపతి బాబు హోస్ట్‌గా చేస్తున్న ఓ టాక్ షోలో హీరోయిన్ రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘మగాళ్లకూ పీరియడ్స్ వస్తే బాగుండేది. అప్పుడు వాళ్లకు మహిళలు అనుభవించే నొప్పి, బాధ, అసౌకర్యం ఏంటో అర్థమయ్యేది’ అని అన్నారు. రష్మిక కామెంట్లపై జగపతి బాబు చప్పట్లు కొట్టి అభినందించారు.

News November 5, 2025

HYD: డ్రంక్‌ & డ్రైవ్‌లో దొరికి PS ముందే సూసైడ్

image

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ సూసైడ్ కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒక వ్యక్తి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.