News February 1, 2025
వచ్చే నెల 10కి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో 1,045 రహదారి పనులు చేపట్టగా ఇంతవరకు 938 పనులు పూర్తయ్యాయని మిగిలిన 107 పనులను ఫిబ్రవరి 10 నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి శాఖ అధికారులకు శుక్రవారం ఆదేశించారు. R&B శాఖ చేపట్టిన రహదారులకు గుంతలు పూడ్చే పనుల్లో భాగంగా 682 కిలోమీటర్ల మేర పనులు చేపట్టారన్నారు. ఇప్పటివరకు 372 కిలోమీటర్లు పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా ఫిబ్రవరి 10 నాటికి పూర్తి చేయాలన్నారు.
Similar News
News November 4, 2025
ఆ ఊర్లో అడుగడుగునా హనుమాన్ ఆలయాలే..

TG: జగిత్యాల(D) వెల్లుల్ల అనే గ్రామంలో ఏ మూల చూసినా, ఏ వాడ తిరిగినా ఆంజనేయుడి గుళ్లే దర్శనమిస్తాయి. 2,500 కన్నా తక్కువ జనాభా ఉన్న ఈ ఊర్లో దాదాపు 45 హనుమాన్ ఆలయాలున్నాయి. పూర్వం ఇక్కడ నివాసమున్న బ్రాహ్మణ కుటుంబాలు తమ వంశాల వారీగా ఎవరికి వారు ఈ ఆలయాలను నిర్మించుకున్నారట. ఈ అన్ని ఆలయాల్లోనూ క్రమం తప్పకుండా పూజలు నిర్వహించడం విశేషం. ☞ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News November 4, 2025
వరికి మానిపండు తెగులు ముప్పు.. ఎలా నివారించాలి?

ఇటీవల భారీ వర్షాలకు మానిపండు తెగులు వరి పంటను ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. ఈ తెగులును కలగజేసే శిలీంధ్రం వరి వెన్నులోని గింజల్లోకి ప్రవేశించి గింజలపై పసుపు రంగులో గుండ్రని ముద్ద లేత పువ్వులాగ మారుతుంది. క్రమేపీ ఇది నలుపు పొడిగా మారి వెన్నులో గింజలను నల్లగా మారుస్తుంది. మానిపండు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News November 4, 2025
క్రీడా ప్రాంగణాలు నిర్మించేందుకు కలెక్టర్ ఆదేశాలు

యువతలో క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహించి, మండలాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా క్రీడా అధికారులతో సోమవారం సమావేశం జరిగింది. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి సరైన ప్రోత్సాహం అందించాలని, యువత చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించేలా, యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల వైపు మొగ్గు చూపే విధంగా చూడాలన్నారు.


