News February 1, 2025
రోడ్డు భద్రత మనందరి బాధ్యత: భద్రాద్రి కలెక్టర్

రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
Similar News
News March 14, 2025
Way2News ఎఫెక్ట్.. వీరభద్రపేట రోడ్డుకు మోక్షం

దేవరాపల్లి(M) వీరభద్రపేటకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ గిరిజనులు వినూత్న నిరసన తెలిపిన విషయం తెలిసిందే. Way2News ఆ సమస్యపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వెలుగులోకి తెచ్చింది. మార్చి 4న గ్రామస్థుల సమస్యలపై ప్రత్యేక వీడియో కథనాన్ని ప్రచురించింది. దీంతో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన రూ.84లక్షల నిధులు మంజూరు చేసింది. ఉపాధి హామీ నిధులతో తారు రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
News March 14, 2025
దైరతుల్ మారిఫిల్ డైరెక్టర్‌గా ప్రొ. షుకూర్

ఉస్మానియా యూనివర్సిటీలోని దైరతుల్ మారిఫిల్ ఉస్మానియా డైరెక్టర్‌గా ప్రొ. ఎస్ఏ షుకూర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఓయూ వీసీ ప్రొ. కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. పురాతన తాళపత్ర గ్రంథాలు, అరబిక్ గ్రంథాలను భద్రపరిచేందుకు నిజాంపాలనలో నెలకొల్పిన ఈ కేంద్రం ఓయూకు అనుబంధంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు డైరెక్టర్‌గా పనిచేసిన షుకూర్ తిరిగి అదే పదవిలో నియమితులయ్యారు.
News March 14, 2025
NZB: పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి అనుమానాస్పద మృతి

NZBలో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు..పెద్దపల్లి, జగిత్యాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్లు సంపత్, చిరంజీవి కలిసి గల్ఫ్‌కు కొందరిని పంపించారు.తీరా అక్కడికి వెళ్లిన వారికి పని లేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్,చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.