News February 1, 2025
నాణ్యమైన విద్య అందించాలి: ASF అదనపు కలెక్టర్

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆసిఫాబాద్ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంటశాలతో పాటు విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. గిరిజన విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
Similar News
News September 13, 2025
సంగారెడ్డి: లోక్ అదాలత్‌లో 4,334 కేసులు పరిష్కారం

సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 4,334 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. క్రిమినల్ కాంపౌండ్ 3,850, సివిల్ – 22, మోటార్ వాహన – 21, ఫ్రీ లిటిగేషన్ -40, బ్యాంకు రికవరీ- 58, సైబర్ క్రైమ్- 93, విద్యుత్ చౌర్యం- 238 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు.
News September 13, 2025
విశాఖ: బీజేపీ సభ ఏర్పాట్ల పరిశీలన

విశాఖ రైల్వే మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న బహిరంగ సభ ప్రాంతాన్ని మంత్రి సత్య కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పరిశీలించారు. జేపీ నడ్డా హాజరవుతున్న ఈ సభకు మరి కొంతమంది ప్రముఖులు కూడా రానున్నారని వారు పేర్కొన్నారు. దీంతో కార్యకర్తల సమీకరణ, స్వాగత ఫ్లెక్సీలను పరిశీలించారు. సభకు దాదాపు 20,000 మంది హాజరవుతారని అంచనా.
News September 13, 2025
పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉచిత టీకాలు వేస్తారని ఆమె తెలిపారు. జిల్లాలోని పశువుల యజమానులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.