News February 1, 2025

SRPT: విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన కలెక్టర్

image

విద్యార్థులు ఉన్నత ఆశయంతో చదివి సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పరిధిలోని ఇమంపేట ఆదర్శ పాఠశాలను సందర్శించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజన నాణ్యతను, మెనూ పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీఈవో అశోక్, అధికారులు ఉన్నారు.

Similar News

News September 17, 2025

హైదరాబాద్‌లో 50 మంది CIల బదిలీ

image

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు, పదోన్నతులు జరిగాయి. తాజాగా కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 50 మంది ఇన్‌స్పెక్టర్లకు బదిలీ, పదోన్నతి ఇచ్చినట్లు వెల్లడించారు. చాలా రోజుల నుంచి ఒకే పోస్టింగ్‌లో ఉన్న వారిని సైతం ఇతర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు.

News September 17, 2025

ఇకపై లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు

image

శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లకు FIFO (First In First Out) స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని TTD ప్రవేశపెట్టింది. టోకెన్లు 3 నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల అవుతాయి. DEC టోకెన్ల కోసం SEP 18-20 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజూ (శుక్రవారం) 750 టోకెన్లు, శనివారాల్లో 500 టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు తిరిగి ఈ సేవ పొందేందుకు గడువు 180 రోజులుగా నిర్ణయించింది.

News September 17, 2025

జగిత్యాల: లక్ష్య సాధనలో బ్యాంకర్లు సహకరించాలి: కలెక్టర్

image

లక్ష్య సాధనలో బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కన్సల్టేటివ్ కమిటీ (DCC) సమావేశం మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ మేనేజర్ జిల్లా స్థాయిలో వార్షిక ఋణ ప్రణాళిక (ACP) అమలుపై నివేదికను సమర్పించారు. అన్ని బ్యాంకులు పంట రుణాల రెన్యువల్ ను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.