News February 1, 2025
రావులపాలెం ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి- కలెక్టర్

రావులపాలెం వద్ద జాతీయ రహదారిపై నిత్యం ఉండే ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఫ్లైఓవర్ నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ జాతీయ రహదారుల ఇంజీనీర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో భూసేకరణ అంశాలపై నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ఈ అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు.
Similar News
News November 9, 2025
పర్వతగిరి: కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు కలెక్టర్ సూచనలు..!

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కలెక్టర్ సత్య శారద సూచనలు చేశారు. ప్రతి రైతు ధాన్యాన్ని 100% ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేసుకుంటేనే మిల్లువారు ఎలాంటి కటింగ్ లేకుండా 41kgకి అంగీకరిస్తారన్నారు. మిల్లులో అన్ లోడింగ్ ఐన మరుక్షణమే OPMS పూర్తి చేసి, 24గంటల్లో రైతుఖాతాలో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యాన్ని నేల మీద కాకుండా కవర్ల మీదే పోయాలని, ప్రతి కుప్ప చుట్టూ చిన్న కందకం చేయాన్నారు.
News November 9, 2025
NLG: ఇక్కడి నాయకులంతా అక్కడే..!

ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైనే చర్చ జరుగుతోంది. సిటీకి దగ్గరగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులంతా HYDలోనే మకాం వేశారు. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, BRS, BJP ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఇక్కడి నాయకులంతా అక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు. పోటాపోటీగా కొనసాగుతున్న ప్రచార పర్వంలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.
News November 9, 2025
పత్తి కొనుగోళ్లపై ఆ నిబంధన ఎత్తేయండి: తుమ్మల

ఖమ్మం: పత్తి కొనుగోళ్లలో ఉన్న నిబంధనలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీసీఐ సీఎండీ లలిత్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎకరాకు 7 క్వింటాళ్ల కొనుగోలు పరిమితిని తక్షణమే ఎత్తివేసి, పాత విధానంలో కొనుగోళ్లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 20 శాతం తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


