News February 1, 2025
రానున్న 10 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి: BHPL కలెక్టర్

వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా రానున్న 10 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో గ్రామ పంచాయితీ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News February 26, 2026
నల్గొండ: ఈ నాన్నకు సలాం చేయాల్సిందే..!

ఆడబిడ్డ.. అందులోనూ దివ్యాంగురాలు.. ఆమెకు చదువెందుకులే అని ఆ తండ్రి అనుకోలేదు. దివ్యాంగురాలైతేనేం.. తన బిడ్డ సరస్వతి మాతకు ప్రతిరూపమని భావించాడు. మర్రిగూడ(M) శివన్నగూడెంకు చెందిన మోర సత్యనారాయణ, ధనమ్మ దంపతుల కూతురు మోర శివానికి ఫ్లోరోసిస్ కారణంగా చిన్నప్పటి నుంచి కాళ్లు పనిచేయవు. ఇవాళ మోడల్ స్కూల్‌లో ఇంటర్ సెకండియర్ పరీక్ష రాసేందుకు తండ్రి తన బిడ్డను ఎత్తుకుని తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచారు.
News February 26, 2026
‘ది కేరళ స్టోరీ-2’ సినిమాపై స్టే

‘ది కేరళ స్టోరీ-2’ సినిమా విడుదలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. ఇందులో వివాదాస్పద అంశాలున్నాయని పేర్కొంది. మూవీ చూడకుండానే CBFC సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఈ సినిమా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ దాఖలైన పిటిషన్లపై రెండు రోజుల క్రితం HC విచారణ జరిపింది. తాము సినిమా చూశాకే నిర్ణయం చెబుతామని తెలిపింది. ఈక్రమంలోనే సినిమా చూసి స్టే ఇచ్చింది.
News February 26, 2026
YCPలోనే ఆదాల.. పార్టీ మార్పు లేనట్లే!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. వైసీపీని వీడి బీజేపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇవాళ నెల్లూరుకు వచ్చిన జగన్‌ను ఆదాల కలిశారు. దీంతో మాజీ MP పార్టీ మార్పు ఊహాగానాలకు చెక్ పడింది.


