News February 1, 2025

చిత్తూరు కలెక్టర్‌ను కలిసిన నగరి DSP 

image

చిత్తూరు జిల్లా సచివాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్‌ను నగరి డీఎస్పీ మహమ్మద్ అజీజ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఎస్పీ మహమ్మద్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ.. నగరి డివిజన్ పరిధిలో ప్రజలకు ఇబ్బందికర సమస్యలు ఉంటే తనను సంప్రదించవచ్చని, తగిన న్యాయం చేస్తామని తెలిపారు. తాను ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటానని తెలిపారు.

Similar News

News January 3, 2026

మూడు రోజుల్లో రూ.9.76 కోట్ల మద్యం తాగేశారు.!

image

చిత్తూరు జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మూడు రోజుల్లో రూ.9.76 కోట్ల విలువైన మద్యాన్ని మందు బాబులు తాగేశారు. నూతన సంవత్సరం వేడుకల్లో జిల్లాలో మద్యం ఏరులై పారింది. డిసెంబరు 30, 31 తేదీలతో పాటు జనవరి ఒకటిన మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ మూడ్రోజుల్లో రూ.9.76 కోట్ల విలువైన.. 5738 కేసుల బీర్లు, ఇండియన్ మేడ్ లిక్కర్ (IML) 14,130 కేసులు అమ్ముడయ్యాయి.

News January 3, 2026

చిత్తూరు: KGBVల్లో 25 పోస్టులకు దరఖాస్తులు.!

image

చిత్తూరు జిల్లాలోని KGBVల్లో 25 ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-4, ANM-6, హెడ్ కుక్-1, ASST కుక్-4 ఖాళీలు ఉండగా టైప్-4లో వార్డెన్-2, పార్ట్ టైమ్ టీచర్-3, చౌకిదార్-2, హెడ్ కుక్-1 ASST కుక్-2 ఉన్నాయి. మహిళలకు మాత్రమే అవకాశం. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

News January 3, 2026

తిరుపతిలో రేపు చిరంజీవి మూవీ ట్రైలర్ లాంచ్

image

హీరో చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఆదివారం తిరుపతిలోని SV సినీప్లెక్స్‌లో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ఉండనుంది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గరికిపాటి, సుస్మిత కొణిదెల, హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర చిత్ర బృంద సభ్యులు పాల్గొననున్నారు.