News February 1, 2025
నిర్మల్‌లో తప్పిపోయి మెట్‌పెల్లిలో కనిపించాడు
నిర్మల్‌లో వ్యక్తి తప్పిపోయి మెట్‌పెల్లిలో కనిపించిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ADBజిల్లా బోథ్‌కు చెందిన అబ్దుల్ మాజీద్ (40) గురువారం నిర్మల్‌లో ఓ శుభకార్యంలో పాల్గొన్నారు. ప్రార్థనల కోసమని బంధువుల ఇంటి నుంచి వెళ్లిన ఆయన కనిపించంలేదు. కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఉన్నట్లు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News February 1, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించండి:ఎంపీ
నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించాలని ప్రతిపాదించినట్లు MP రఘురాంరెడ్డి తెలిపారు. KTDMఎయిర్‌పోర్ట్, భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్, KMM-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే, KMM- VJD హైవేకు నిధులు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. KTDM కలెక్టరేట్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, కిన్నెరసానిపై రెండో వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.
News February 1, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించండి:ఎంపీ
నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించాలని ప్రతిపాదించినట్లు MP రఘురాంరెడ్డి తెలిపారు. KTDMఎయిర్‌పోర్ట్, భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్, KMM-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే, KMM- VJD హైవేకు నిధులు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. KTDM కలెక్టరేట్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, కిన్నెరసానిపై వంతెన నిర్మాణానికి సైతం నిధులు కేటాయించాలని కోరారు.
News February 1, 2025
నేటి నుంచి జిల్లాలో పోలీసు యాక్ట్: ఎస్పీ
సంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లీక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.