News February 1, 2025

సీజనల్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్: జగ్గారెడ్డి

image

సీజనల్ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మారాడని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ వ్యాఖ్యలను జగ్గారెడ్డి హైదరాబాదులోని గాంధీభవన్లో ఖండించారు. రియల్ ఎస్టేట్ కొంపముంచింది కేసీఆరేనని విమర్శించారు. ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్‌ను కేసీఆర్ నాశనం చేశారన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 1, 2025

నిలిచిపోయిన పెన్షన్ల పంపిణీ?

image

AP: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. సర్వర్‌లో సమస్య రావడంతో పింఛన్ల పంపిణీ ప్రారంభమైన కాసేపటికే నిలిచిపోయినట్లు సమాచారం. సమస్యను పరిష్కరించి పింఛన్ల పంపిణీని కొనసాగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

News February 1, 2025

FLASH.. గద్వాల: జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న బస్సు

image

ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో 44 జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒక లారీని ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొంది. వెనకనే వస్తున్న మరో బస్సు ముందున్న బస్సును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ చంద్రశేఖర్ తో పాటు ఆరుగురికి గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 1, 2025

గద్వాల: బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టి వెళ్లిపోయారు..!

image

జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయచూర్ రోడ్డు మార్గంలో పార్చర్ల స్టేట్ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కేటీదొడ్డికి చెందిన బుడ్డ వీరన్న తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈయనను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.