News February 1, 2025

కుంభమేళాకు సగం ధరకే విమాన టికెట్ల ధరలు: కేంద్ర మంత్రి

image

కుంభమేళాకు వెళ్లే భక్తులకు సగం ధరకే విమాన ప్రయాణం చేయొచ్చని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. కాగా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ వెళ్లే అన్ని విమాన సంస్థలు భారీగా టికెట్లు రేట్లు పెంచాయి. దీనిపై కేంద్రానికి వినతులు వెల్లువెత్తడంతో 50 శాతం ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంది.

Similar News

News February 1, 2025

‘స్వచ్ఛంద మరణం’ హక్కును అమలు చేయనున్న కర్ణాటక

image

కారుణ్య మరణాలపై SC ఆదేశాల అమలుకు KA సిద్ధమైంది. ఎప్పటికీ నయమవ్వని, బాధను భరించలేక, నరకం అనుభవిస్తూ లైఫ్ సపోర్టుతో ఆస్పత్రిలో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్న వారికి గౌరవంగా మరణించే హక్కును అమలు చేయనుంది. మొదట ముగ్గురు డాక్టర్లు రోగి పరిస్థితిని సమీక్షిస్తారు. తర్వాత Govt నియమించిన డాక్టర్, మరో ముగ్గురు డాక్టర్ల బృందం సమీక్షించి రిపోర్టును కోర్టుకు పంపుతుంది. కోర్టు ఆమోదిస్తే ఇంజెక్షన్లు ఇస్తారు.

News February 1, 2025

నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ‘పుష్ప 2’

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీకి ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది. టాప్-10 మూవీస్‌లో ఈ సినిమా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ మూవీ గత నెల 30న ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. కాగా ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు రూ.1,900 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.

News February 1, 2025

Stock Markets: రైల్వే, డిఫెన్స్ షేర్లపై ఫోకస్

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాల్లో మొదలై రేంజుబౌండ్లో కదలాడే సూచనలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ 97 పాయింట్ల మేర నష్టపోవడం దీనినే సూచిస్తోంది. బడ్జెట్ మొదలయ్యాక సెంటిమెంటును బట్టి ఎటువైపైనా స్వింగ్ అవ్వొచ్చు. వృద్ధి, వినియోగం, ఇన్ఫ్రా, SMEలపై ఫోకస్ నేపథ్యంలో రైల్వే, డిఫెన్స్, బ్యాంక్స్, PSE షేర్లపై ఆసక్తి నెలకొంది. బడ్జెట్ కావడంతో శనివారమైనా స్టాక్‌మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి.