News February 1, 2025

నిజాంసాగర్ ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల

image

నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా మూడో విడత నీటిని శుక్రవారం విడుదల చేశారు. ఆయకట్టు కింద సాగవుతున్న 1.35 లక్షల ఎకరాల్లో పంటల సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 1300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ ఏఈ శివకుమార్‌ తెలిపారు. రెండో విడతలో ఇప్పటి వరకు 3.84 టీఎంసీల నీటిని విడుదల చేశామని చెప్పారు. మూడో విడతలో 15 రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

Similar News

News February 1, 2025

FLASH.. గద్వాల: జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న బస్సు

image

ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో 44 జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒక లారీని ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొంది. వెనకనే వస్తున్న మరో బస్సు ముందున్న బస్సును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ చంద్రశేఖర్ తో పాటు ఆరుగురికి గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 1, 2025

వరంగల్ పోలీసులకు పతకాలు

image

రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీసులు ఆర్చరీలో రికార్డు సృష్టించారు. ఈ క్రీడలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఏకంగా ఐదు పతకాలను సాధించారు. మూడు బంగారు పతకాలతో పాటు ఒక రజతం, ఒక కాంస్యం పతకాన్ని గెలుచుకున్నారు. ఎస్ఐ అనిల్ వేర్వేరు విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించగా, ఎస్ఐ రాజేందర్, కానిస్టేబుల్ రాహుల్ ఒలింపిక్ విభాగంలో రజతం, కాంస్య పతకాలు సాధించారు.

News February 1, 2025

‘స్వచ్ఛంద మరణం’ హక్కును అమలు చేయనున్న కర్ణాటక

image

కారుణ్య మరణాలపై SC ఆదేశాల అమలుకు KA సిద్ధమైంది. ఎప్పటికీ నయమవ్వని, బాధను భరించలేక, నరకం అనుభవిస్తూ లైఫ్ సపోర్టుతో ఆస్పత్రిలో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తున్న వారికి గౌరవంగా మరణించే హక్కును అమలు చేయనుంది. మొదట ముగ్గురు డాక్టర్లు రోగి పరిస్థితిని సమీక్షిస్తారు. తర్వాత Govt నియమించిన డాక్టర్, మరో ముగ్గురు డాక్టర్ల బృందం సమీక్షించి రిపోర్టును కోర్టుకు పంపుతుంది. కోర్టు ఆమోదిస్తే ఇంజెక్షన్లు ఇస్తారు.