News February 1, 2025

వికారాబాద్: ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ 

image

జిల్లాలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా వ్యాప్తంగా రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనేందుకు కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవోలు అధికారులు వేసవి నీటి కరువు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. 

Similar News

News February 1, 2025

గద్వాల: బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టి వెళ్లిపోయారు..!

image

జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయచూర్ రోడ్డు మార్గంలో పార్చర్ల స్టేజీ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కేటీదొడ్డికి చెందిన బుడ్డ వీరన్న తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈయనను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 1, 2025

గుర్ల: విద్యుత్ వైర్లు పట్టుకుని యువకుడి సూసైడ్

image

గుర్ల మండలంలో ఓ యువకుడు విద్యుత్ వైర్లు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌ రాష్ట్రానికి చెందిన పులేషణ కుమార్ గుర్ల మండలం కోటగండ్రేడు రైస్‌మిల్లులో 2 నెలలుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం రైస్‌మిల్ దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వైర్లను పట్టుకున్నాడు. గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేసి యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందగా SI నారాయణ కేసునమోదు చేశారు.