News February 1, 2025
నర్సాపూర్ (జి): మద్యం మత్తులో ఉరేసుకున్నాడు..!

నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన కోడె ప్రభాకర్(40) భార్య 4 ఏళ్ల క్రితం మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శుక్రవారం మద్యం మత్తులో ఇంట్లో దూలానికి ఉరేసుకొని మృతి చెందాడన్నారు.
Similar News
News November 6, 2025
WPL-2026.. రిటైన్ లిస్టు ఇదే..

WPL-2026 ఎడిషన్ కోసం ఢిల్లీలో ఈనెల 27న వేలం జరగనుంది. దీనికి ముందు 5 జట్లు పలువురు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. ఆ జాబితా ఇదే..
RCB: స్మృతి మంధాన(3.5Cr), రిచా ఘోష్(2.75Cr), పెర్రీ(2Cr), శ్రేయాంక(60L)
MI: హర్మన్‌ప్రీత్, బ్రంట్, హేలీ, అమన్‌జోత్, కమలిని
DC: జెమీమా, షఫాలీ, అన్నాబెల్, మారిజాన్, నికి ప్రసాద్
UP వారియర్స్: శ్వేతా సెహ్రావత్
గుజరాత్: ఆష్లీ గార్డ్‌నర్, బెత్ మూనీ
News November 6, 2025
వరల్డ్ క్లాస్ బ్యాంకుల కోసం చర్చలు: నిర్మల

భారత్‌కు అతిపెద్ద, వరల్డ్ క్లాస్ బ్యాంకుల అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. ఆర్బీఐతోపాటు బ్యాంకులతోనూ చర్చిస్తున్నామని ముంబైలో జరిగిన 12th SBI బ్యాంకింగ్&ఎకనామిక్స్ కాంక్లేవ్‌లో తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టిసారించామని, పదేళ్లలో మూలధన వ్యయం 5 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు.
News November 6, 2025
ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితా రూపొందిస్తున్నాం: కలెక్టర్

జిల్లాలో ఖచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితా రూపొందిస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కి వివరించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి నిర్వహించిన వీసీలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటుచేసి, సూచనలు, ఫిర్యాదులను తీసుకుంటున్నామని కలెక్టర్ అన్నారు.


