News February 1, 2025

MNCL: పదో తరగతి ఫలితాల్లో ఉత్తమంగా నిలవాలి: DEO

image

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచేలా కృషి చేయాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య సూచించారు. శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ ఎయిడెడ్, తెలంగాణ ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో నిర్వహించే గ్రాండ్ టెస్ట్, మార్చిలో నిర్వహించే ప్రీ ఫైనల్ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలన్నారు.

Similar News

News March 12, 2026

నద్యాల జిల్లాలో 2,06,052 మంది రైతులకు లబ్ధి..!

image

నంద్యాల జిల్లాలో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులు శుక్రవారం జమ కానున్నాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 2,06,052 మంది రైత లబ్ధిదారులు ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. వీరికి సంబంధించి పీఎం కిసాన్ రూ.2,000, అన్నదాత సుఖీభవ కింద రూ.4,000 అందుతుందన్నారు. జిల్లాలో మొత్తం రూ.119.90 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానుందన్నారు.

News March 12, 2026

రేపు రైతుల ఖాతాల్లోకి రూ. 84.8 కోట్ల నిధుల జమ

image

అన్నదాతలకు ప్రభుత్వం పండగలాంటి వార్త అందించింది. పీఎం కిసాన్ యోజన నుంచి రూ. 24.61 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద రూ. 60.19 కోట్లు కలిపి మొత్తం రూ. 84.8 కోట్లు నేరుగా కాకినాడ రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవలో 1,50,475 మందికి, పీఎం కిసాన్ లో 1,23,045 మందికి లబ్ధి చేకూరుతుంది. ఈ నిధులతో రైతులకు పెట్టుబడి కష్టాలు తీరనున్నాయి.

News March 12, 2026

‘జిల్లాలో శనగల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి’

image

జిల్లాలో శనగల కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్‌లో గురువారం జేసీ అశుతోష్ శ్రీవాత్సవకు బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం శనగ పంటకు క్వింటాకు రూ.5,875 ఉన్నా మార్కెట్లో రూ4,500 మాత్రమే ధర లభిస్తుందని జేసీకి వివరించారు. కొనుగోళ్ల కేంద్రాలను పెంచి సమస్యను పరిష్కరించాలన్నారు. వినతి ఇచ్చినవారిలో తిరుపతిరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.