News February 1, 2025
‘పది’ విద్యార్థుల అల్పాహారానికి నిధులు విడుదల: డీఈవో

జడ్పీ స్కూల్స్ ‘పది’ విద్యార్థులకు 30 రోజుల పాటు అల్పాహారం అందించనున్నట్లు డీఈవో సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ విద్యార్థికి రోజుకు రూ 07.50చొప్పున మొత్తం రూ.20,40,750 లను గుంటూరు జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి మంజూరు చేశారని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో ఆ నిధులు జమ చేశారన్నారు. ప్రతీ రోజు అరటిపండ్లు, బిస్కెట్లు, కోడిగుడ్లు, గుగిళ్ళు విద్యార్థులకు ఇవ్వాలన్నారు.
Similar News
News October 30, 2025
GNT: ‘పత్తి రైతులు పొలంలో నీరు తొలగించుకోవాలి’

తుఫాను వలన ముంపుకు గురైన పంటలకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వర రావు ఒక ప్రకటనలో సూచించారు. పత్తి రైతులు వీలైనంత త్వరగా నీరు తొలగించి అంతర కృషి చేసి, నేల ఆరేటట్లు చేయాలన్నారు. అధిక తేమ వలన మొక్కలు భూమి నుండి పోషకాలను గ్రహించే స్థితిలో వుండవని చెప్పారు. అటువంటి పరిస్థితులలో మొక్కలు ఎర్రబడటం, వడలటం, ఎండిపోవడం జరుగుతుందన్నారు.
News October 30, 2025
తుపాన్ సహాయక చర్యల్లో అధికారుల పనితీరు భేష్: కలెక్టర్

తుపాన్ సహాయక చర్యల్లో జిల్లా వ్యాప్తంగా అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు అభినందనీయమని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లాలో మొత్తం 4,553 కుటుంబాలకు చెందిన 9,450 మందిని పునరావస కేంద్రాలకు తరలించి రక్షణ కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వం ద్వారా కుటుంబానికి రూ.3 వేలు, నిత్యవసర సరకులు ప్రభుత్వం అందిస్తోందని, ఈ కార్యక్రమాన్ని తెనాలి నుంచి ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు.
News October 30, 2025
ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న ఇన్ ఫ్లో

తుపాన్ కారణంగా కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా తరలివస్తుంది. గురువారం ఉదయం 11 గంటల వరకు 2,74,263 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా ఉంది. బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.9 అడుగులుగా ఉంది. దీంతో అన్ని కెనాల్స్ మూసివేసినట్లు అధికారులు తెలిపారు. నేటి సాయంత్రానికి దాదాపు 6 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నారు.


