News February 1, 2025
రాజమండ్రిలో వ్యక్తి మృతి

రాజమండ్రి రూరల్ మండలం కవలగొయ్యి గ్రామానికి చెందిన తీపర్తి బుల్లిబాబు(45) కాకినాడ GGHలో శుక్రవారం మృతి చెందాడు. బొమ్మూరు ఎస్సై అంకారావు వివరాల మేరకు.. ఈనెల 26న బుల్లిబాబు భార్యను మద్యం తాగేందుకు డబ్బులు అడిగాడు. ఆమె డబ్బులు లేవనిచెప్పడంతో గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం మెరుగైన వైద్యానికి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.
Similar News
News April 9, 2026
రాజమండ్రి TO కాశీ, అయోధ్యకు బస్సు: డీఎం

పుణ్యక్షేత్రాల సందర్శనకు ఏప్రిల్ 19 నుంచి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు ప్రారంభిస్తున్నట్లు రాజమండ్రి డిపో మేనేజర్ మాధవ్ తెలిపారు. 11 రోజుల పాటు సాగే ఈ యాత్రలో రాజమండ్రి నుంచి కాశీ, అయోధ్య, పూరి సహా 13 ఆలయాలను సందర్శించవచ్చన్నారు. టికెట్ ధర రూ.13,000గా నిర్ణయించామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు డిపోలో సంప్రదించాలని ఆయన వెల్లడించారు.
News April 8, 2026
నన్నయ వర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ రాక

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 16, 17వ స్నాతకోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. బుధవారం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ స్నాతకోత్సవ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేడుకల ఏర్పాట్లు, వివరాలను గవర్నర్‌కు వివరించారు. గవర్నర్ రాకతో విశ్వవిద్యాలయ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు.
News April 8, 2026
10న జిల్లాకు రానున్న గవర్నర్

గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ నెల 10వ తేదీ శుక్రవారం తూ.గో జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. ఆరోజు విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో రాజమండ్రి చేరుకుంటారని ఆమె వెల్లడించారు. అనంతరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో జరిగే XVI, XVII సంయుక్త కన్వొకేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.


