News February 1, 2025
MDK: యువతితో అసభ్య ప్రవర్తన.. మూడేళ్ల జైలు శిక్ష: ఎస్పీ
రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన చంద్రలింగం అదే గ్రామానికి చెందిన అమ్మాయిని చేతి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై కేసు నమోదైనట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.21 వేల జరిమానా విధించినట్లు చెప్పారు. కేసు పూర్తిగా విచారణ చేసి మెదక్ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీ శారద తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News February 1, 2025
మెదక్: అయ్యో పాపం.. కాలు తీసేశారు..!
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో రెండురోజుల క్రితం <<15308889>>ఉపాధి హామీ<<>> కూలీలపై మట్టి పెళ్లలు పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలయిన ఇంద్రాల స్వరూప కాలు నుజ్జు నుజ్జు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు ఆమె కాలును తొలగించారు. ఈ సంఘటనలో తల్లి కూతుర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకొని ఇంటికి వస్తుందని అనుకున్న స్వరూప కాలు తీసేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
News February 1, 2025
మెదక్: చిన్నపిల్లలను పనిలో పెట్టుకోవద్దు: ఎస్పీ
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ.ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో గల బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో 1 జనవరి 2025 నుంచి 31 జనవరి వరకు ఆపరేషన్ స్మెల్-XI నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 122 మంది బడి మానేసి వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని గుర్తించామన్నారు.
News February 1, 2025
ఆపరేషన్ స్మెల్.. 122 మంది పిల్లలు తల్లిదండ్రుల చెంతకు
మెదక్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మెల్ -11 నిర్వహించి 122 మంది పిల్లలను తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. బడి మానేసినా, వివిధ దుకాణాలు, కర్మాగారాలు, ఇటుక భట్టిల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి, రెస్క్యూ చేసి వారికి, వారి తల్లితండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.