News February 1, 2025
పార్వతీపురం: జిల్లాలో నేడు 1,40,460 మందికి పింఛన్ల పంపిణీ

పార్వతీపురం మన్యం జిల్లాలో నేడు 1,40,460 మందికి పింఛన్ల పంపిణీ చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు డీఆర్డీఏ పీడీ వై సత్యం నాయుడు తెలిపారు. పింఛన్ల పంపిణీకి రూ. 59.28 కోట్లు సచివాలయ సిబ్బందికి, ఉద్యోగులకు అందజేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో తొలిరోజు శతశాతం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. లబ్ధిదారులు ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు.
Similar News
News November 7, 2025
APPLY NOW: NIEPMDలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ మల్టిపుల్ డిజాబిలిటీస్ (NIEPMD)లో 7 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, మహిళలు, PWBDకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. BOT, PG డిప్లొమా, BPT, Bsc నర్సింగ్, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://<
News November 7, 2025
బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్

బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పేరెంట్స్ అయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 7న మగబిడ్డ జన్మించాడని విక్కీ కౌశల్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరికి 2021లో వివాహమైంది.
News November 7, 2025
భారత భూమికి ఉన్న గొప్పతనం ఇదే!

గత 8 ఏళ్లలో 14 దేశాలు తిరిగిన తర్వాత ఇండియాకు ఉన్న గొప్పతనాన్ని గుర్తించానని ఓ ట్రావెలర్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. అమెరికా & యూరప్‌లలో ఎక్కువగా చలి, మధ్యప్రాచ్యంలో దారుణమైన వేడి, ఆగ్నేయాసియాలో అధిక తేమ ఉంటుందని పేర్కొన్నారు. అదే ఇండియాలో వెదర్ హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. ప్రకృతి ఇంతగా అనుకూలించినప్పటికీ అవినీతి, దూరదృష్టి లోపం కారణంగానే భారత్ వెనకబడిందని అభిప్రాయపడ్డారు.


