News February 1, 2025
వర్ధన్నపేట: ఏడో తరగతి బాలిక సూసైడ్

ఏడో తరగతి బాలిక సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన నందిని(12) సంక్రాతి సెలవులకు ఇంటికి వచ్చి పాఠశాలకు వెళ్లకపోవడంతో గురువారం తల్లిదండ్రులు మందలించారు. దీంతో బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లి శుక్రవారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.
Similar News
News July 6, 2025
శంషాబాద్: రేపు పోస్ట్ ఆఫీస్ సేవలు నిలిపివేత

పోస్ట్ ఆఫీస్ సేవలను సోమవారం నిలిపివేస్తున్నట్లు సౌత్ ఈస్ట్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ హైమావతి తెలిపారు. వినియోగదారులకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు తపాలా శాఖ పోస్టల్ టెక్నాలజీ ఐటీ 2.0ను ప్రవేశ పెడుతుంది. ఈనెల 8 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇందులో భాగంగా రేపు పోస్టాఫీసుల్లో ఎలాంటి లావాదేవీలు జరగవని పేర్కొన్నారు.
News July 6, 2025
అనకాపల్లి: నేడు ఉచితంగా రేబిస్ వ్యాక్సినేషన్

ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ఆయన జిల్లా పశువైద్యాధికారి రామ్మోహన్ రావు శనివారం తెలిపారు. అనకాపల్లి గాంధీ ఆసుపత్రిలో మాట్లాడుతూ.. స్థానిక జిల్లా ఆసుపత్రితో పాటు అన్ని మండలాల్లో గల పశువైద్య కేంద్రాల్లో రేబిస్ వ్యాక్సిన్ వేస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News July 6, 2025
‘అన్నదాత సుఖీభవ’ అనర్హులకు అలర్ట్

AP: ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అర్హత సాధించని రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. మొదటి దశ పరిశీలన, రెండోదశ ధ్రువీకరణలో అర్హత సాధించలేకపోయిన రైతుల రికార్డులను కంప్లైంట్ మాడ్యూల్లో పొందుపరిచారు. అనర్హులుగా ఉన్న రైతులు ఫిర్యాదు చేసేందుకు ముందు రైతు సేవాకేంద్రంలోని సిబ్బందిని కలవాలని అధికారులు తెలిపారు. ఈనెల 10లోపు ఫిర్యాదుల స్వీకరణ ముగించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ సూచించారు.