News February 1, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించండి:ఎంపీ

image

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకు నిధులు కేటాయించాలని ప్రతిపాదించినట్లు MP రఘురాంరెడ్డి తెలిపారు. KTDMఎయిర్‌పోర్ట్, భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్‌, KMM-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, KMM- VJD హైవేకు నిధులు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. KTDM కలెక్టరేట్‌ వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్, కిన్నెరసానిపై వంతెన నిర్మాణానికి సైతం నిధులు కేటాయించాలని కోరారు.

Similar News

News January 5, 2026

మహిళల భద్రతకు ‘పోష్‌’ కమిటీలు తప్పనిసరి: కలెక్టర్

image

పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నివారించేందుకు ‘పోష్’ చట్టం-2013ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలని, అందులో సగం మంది మహిళలే ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ సంస్థలు నెల రోజుల్లోగా ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని గడువు విధించారు.

News January 5, 2026

అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

image

ప్రజావాణిలో అందిన దరఖాస్తులపై జిల్లా అధికారులు స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సత్తుపల్లి, వైరా, ఖమ్మం అర్బన్ ప్రాంతాల నుంచి భూ వివాదాలు, పర్యావరణం, మున్సిపల్ సమస్యలపై ఫిర్యాదులు అందాయి. వీటిని ఆయా విభాగాలకు బదిలీ చేస్తూ.. నిబంధనల మేరకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News January 5, 2026

ఖమ్మం ఐటీ హబ్‌లో ఉచిత శిక్షణ

image

ఖమ్మం ఐటీ హబ్‌లో నిరుద్యోగ యువతకు వివిధ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రాంతీయ కేంద్ర మేనేజర్ అశోక్ తెలిపారు. జావా, పైథాన్, ఒరాకిల్ ఎస్‌క్యూఎల్, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, బూట్‌స్ట్రాప్, జావా స్క్రిప్ట్ వంటి ప్రోగ్రామింగ్ భాషల్లో నైపుణ్యం కల్పిస్తామన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 13వ తేదీ లోపు ఐటీ హబ్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.