News February 1, 2025

పాలకుర్తి: ఆన్‌లైన్ సెంటర్ సీజ్ చేసిన అధికారులు

image

పాలకుర్తిలో యాకేశ్ అనే వ్యక్తి కార్తీక కామన్ ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేస్తున్నాడు. శుక్రవారం సీజ్ చేసినట్లు రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రాకేశ్ తెలిపారు. ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయడానికి ఐడీ లేకున్నా ఇతరుల ఐడీతో ఆధార్ వివరాల అప్‌డేట్ చేయడంతో సెంటర్‌ను సీజ్ చేసి 2 ల్యాప్‌టాప్‌లు, 2 ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Similar News

News February 1, 2025

బిహార్‌కు వరాల జల్లు

image

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌కు కేంద్రం బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది.
*బిహార్ కేంద్రంగా మఖానా బోర్డు ఏర్పాటు
*బిహార్‌లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు
*నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటు
*పట్నా విమానాశ్రయం విస్తరణ
*బిహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు

News February 1, 2025

ఫుట్‌వేర్ సెక్టార్‌కు కొత్త స్కీమ్.. 22 లక్షల మందికి ఉపాధి

image

ఫుట్‌వేర్, లెదర్ సెక్టార్‌లో ఉత్పత్తి, నాణ్యతను మెరుగుపరించేందుకు ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నాణ్యమైన లెదర్, నాన్ లెదర్ పాద రక్షల ఉత్పత్తి, డిజైన్, యంత్రాలకు మద్దతునివ్వడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని తెలిపారు. కొత్తగా 22 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. రూ.1.1 లక్షల కోట్ల ఎగుమతులు సాధిస్తుందని చెప్పారు.

News February 1, 2025

BUDGET: మెడిసిన్ ఆశావహులకు స్వీట్ న్యూస్

image

మెడిసిన్ చదవాలనుకుంటున్న వారికి నిర్మలా సీతారామన్ ఒక స్వీట్ న్యూస్ చెప్పారు. రాబోయే ఐదేళ్లలో మెడికల్ సీట్లను మరో 75000 పెంచుతామని తెలిపారు. 2025-26లో 200 క్యాన్సర్ సెంటర్లను నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఇక యువత కోసం దేశవ్యాప్తంగా 5 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఆరంభిస్తామన్నారు. రూ.500 కోట్లతో విద్యలో AI ఎక్సలెన్సీ సెంటర్ పెడతామన్నారు.