News February 1, 2025
మెగాస్టార్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్?

సినిమాల్లో హీరోలను ఎలివేట్ చేయడంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది. అలా యాక్షన్‌కు తగ్గట్లుగా ప్రేక్షకులను తమ BGMతో అలరించే సంగీత దర్శకుల్లో అనిరుధ్ ఒకరు. ఇప్పుడు ఆయన శ్రీకాంత్ ఓదెల-మెగాస్టార్ కాంబోలో వచ్చే సినిమాకు పనిచేయబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను హీరో నాని నిర్మిస్తున్నారు.
Similar News
News November 1, 2025
మైనారిటీలకు ఫ్రీగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్

AP: మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. త్వరలో క్లాసులు ప్రారంభం అవుతాయన్నారు. అభ్యర్థులు తమ వివరాలను <
News November 1, 2025
అదునులో పొదలో చల్లినా పండుతుంది

సక్రమంగా వర్షాలు కురిసి, నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. ఒకవేళ నేలమీద పొదలు అడ్డమున్నా ఆ పొదల నుంచి జారి నేలమీద పడ్డ గింజలు నేల అదునుగా ఉంటే పండితీరుతాయి. అలాగే సమయం, సందర్భం కలిసొచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విజయం తప్పక లభిస్తుందని తెలియజెప్పే సందర్భాలలో దీన్ని ఉపయోగిస్తారు.
News November 1, 2025
2 రోజుల్లో అల్పపీడనం.. AP, TGలో వర్షాలు

రానున్న 2 రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అటు TGలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముంది.


