News February 1, 2025

Income Tax: బడ్జెట్లో మీ కోరికేంటి?

image

మరికొన్ని గంటల్లో FM నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ పెడతారు. నిన్న పార్లమెంటు లోపల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, బయట ప్రధాని మోదీ ప్రసంగాలను బట్టి ఈసారి మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లులు కురిపించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. Income Tax పరంగా మరింత ఊరట కల్పిస్తారని అంచనా. ప్రస్తుతం రూ.7LPA వరకు ఎలాంటి పన్ను లేదు. ఇప్పుడు దీనిని రూ.10LPAకు పెంచుతారా? అసలు మీ కోరికేంటి? కామెంట్ చేయండి.

Similar News

News November 5, 2025

GET READY: మరికాసేపట్లో..

image

మరికొన్ని నిమిషాల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా సా.6.49 గంటలకు చంద్రుడు భూమికి అతి సమీపంగా వచ్చి కనువిందు చేయనున్నాడు. సాధారణ రోజులతో పోలిస్తే భూమికి దగ్గరగా చంద్రుడు రావడంతో 14% పెద్దగా, 30% అధిక కాంతితో దర్శనమిస్తాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్‌గా పిలుస్తారు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి.

News November 5, 2025

ఓటేసేందుకు వెళ్తున్న బిహారీలు.. ఆగిన నిర్మాణ పనులు

image

దేశంలోని చాలా ప్రాంతాల్లో నిర్మాణం, హోటల్స్ సహా అనేక రంగాల్లో లక్షలాది మంది బిహార్ వలస కార్మికులు పనిచేస్తున్నారు. ఈనెల 6, 11 తేదీల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వారంతా స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో ఆయా రంగాలపై ప్రభావం పడుతోంది. దాదాపు 8 లక్షల మంది బిహార్ కార్మికులు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు అంచనా. వీరంతా వచ్చే వరకు 10 రోజులు పనులకు ఇబ్బంది తప్పదని నిర్మాణ పరిశ్రమ తెలిపింది.

News November 5, 2025

ఇతిహాసాలు క్విజ్ – 57 సమాధానాలు

image

1. శబరి రాముడి కోసం ‘మాతంగి రుషి’ ఆశ్రమంలో ఎదురు చూసింది.
2. విశ్వామిత్రుడి శిష్యులలో శతానందుడు ‘గౌతముడి’ పుత్రుడు.
3. కుబేరుడు రాజధాని నగరం పేరు ‘అలక’.
4. నారదుడు ‘వీణ’ వాయిద్యంతో ప్రసిద్ధి చెందాడు.
5. కాలానికి అధిపతి ‘యముడు’. కొన్ని సందర్భాల్లో కాళిదేవి, కాళుడు అని కూడా చెబుతారు.
<<-se>>#Ithihasaluquiz<<>>