News February 1, 2025
MNCL: అభయారణ్యం నుంచి వెళ్లే వాహనాలకు FEES

చెన్నూరు డివిజన్ ప్రాణహిత కృష్ణ జింకల వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన ప్రాంతం గుండా వెళ్లే వాహనాలకు పర్యావరణ రుసుం వసూలుకు ప్రతిపాదించినట్లు జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు. వెంచపల్లి రక్షిత అటవీ ప్రాంతంలోని కంపార్ట్మెంట్ నంబర్ 329, కోటపల్లిలోని పారుపల్లి, చెన్నూర్‌లోని కిష్టంపేట బీట్ వై జంక్షన్ వద్ద 2 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామన్నారు.
Similar News
News November 10, 2025
కేడీసీలో ఘనంగా అంతర్జాతీయ అకౌంట్స్ దినోత్సవం

హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (KDC) లో అంతర్జాతీయ అకౌంట్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.గుర్రపు శ్రీనివాస మాట్లాడుతూ.. జంట పద్దు విధానాన్ని లూకాపాసియోలి రూపొందించి ఈ రోజున మొదటిసారిగా ప్రచురించారన్నారు. అందువల్లనే ఈరోజున అంతర్జాతీయ అకౌంటింగ్ దినోత్సవంగా జరుపుకొంటారని పేర్కొన్నారు.
News November 10, 2025
భూముల్లో సూక్ష్మపోషక లోపాలు ఎందుకు వస్తాయి?

తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో జింకు, ఇనుము, బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, మాంగనీసు లోపం.. నీరు నిలిచే లోతట్టు భూములు, మురుగు నీరు పోని భూములు, అన్నివేళలా నీరు పెట్టే వరి పొలాల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువ. సాగు నీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్లు ఎక్కువైనప్పుడు ఇనుపదాతు లోపం కనిపిస్తోంది.
News November 10, 2025
ఇల్లెందులో విషాదం.. 3 నెలల గర్భిణీ మృతి

ఇల్లెందు మండలం లచ్చగూడెంలో విషాదం చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం వివాహమైన అంజలి (20) అనే వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మూడు నెలల గర్భిణీ అయిన అంజలి, ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తమ కుమార్తె ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


