News February 1, 2025

గద్వాల: పాఠశాల ఘటనలో ఉపాధ్యాయురాలు సస్పెండ్

image

గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యార్థినిని వాతలు పడేలా కొట్టిన ఉపాధ్యాయురాలిని పాఠశాల విధుల నుంచి తొలగించామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. అదే విధంగా విద్యార్థికి అయ్యే వైద్య ఖర్చుల మొత్తాన్ని పాఠశాల యాజమాన్యం భరిస్తుందని అన్నారు.

Similar News

News January 5, 2026

గజగజ వణికిస్తున్న చలి.. కల్వకుర్తిలో 12.1 డిగ్రీలు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో కల్వకుర్తిలో అత్యల్పంగా 12.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. బిజినపల్లిలో 12.8, నాగర్‌కర్నూల్‌లో 13.5 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అకస్మాత్తుగా పెరిగిన చలికి జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

News January 5, 2026

చెన్నూర్‌లో వలస కూలీ హత్య..?

image

చెన్నూర్ మండలం కత్తెరశాల పంచాయతీ సుబ్బారావు పల్లిలో ఒడిశాకు చెందిన వలస కూలీ జితేందర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కూలీల మధ్య జరిగిన గొడవలే ఈ మరణానికి కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యనా? లేక ప్రమాదమా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. కేసు నమోదైంది.

News January 5, 2026

ఆదిలాబాద్: పులులు వచ్చాయి.. వెళ్తున్నాయి..!

image

ఆవాసం కోసం వచ్చిన మూడు పులులు జిల్లాను వీడాయి. సరిహద్దులు దాటి వెళ్లినట్లు అటవీశాఖ గుర్తించింది. ఒక మగ పులి చెన్నూర్, జైపూర్ మీదుగా గోదావరి దాటి MHBD జిల్లాకు చేరుకుంది. మరోటి పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించి మానేరు తీరంలో సంచరిస్తోంది. జన్నారంలోని పులి సిరిసిల్ల, కామారెడ్డి సరిహద్దులకు వెళ్లింది. ప్రస్తుతం లక్షెట్టిపేట, BPL, నీల్వాయి ప్రాంతాల్లో రెండు పులులు సంచరిస్తుండటం గమనార్హం.