News February 1, 2025
యువతిని మోసం చేసిన వరంగల్ యువకుడు
వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన సాయితేజ(26) ప్రేమ పేరుతో ఓ యువతిని(21) మోసం చేశారు. HYD SRనగర్ పోలీసుల ప్రకారం.. సనత్‌నరగ్‌కు చెందిన యువతి బేగంపేటలో పనిచేస్తోంది. సాయితేజ ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భవతి కావడంతో అబార్షన్ చేయించాడు. చివరికి వేరే అమ్మాయిని చేసుకుంటానని బాధితురాలికి చెప్పి వెళ్లిపోయాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News February 1, 2025
₹4L-8L వరకు 5% పన్ను.. మరి ₹12.75Lకు జీరో ట్యాక్స్ ఎందుకంటే?
Income Taxలో వేర్వేరు శ్లాబులకు వేర్వేరు పన్ను రేట్లు ఉన్నప్పటికీ రూ.12.75లక్షల వరకు ఎందుకు ట్యాక్స్ ఉండదని చాలామందికి డౌట్. విషయం ఏంటంటే గతంలో రూ.7L వరకు రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ (SD), రూ.25వేలు రిబేట్ ఉండేది. ఇప్పుడు SDను అంతే ఉంచి రిబేటును రూ.60వేలకు పెంచారు. అందుకే ఈ రెండూ కలుపుకొని రూ.12.75L వరకు ట్యాక్స్ ఉండదు. ఇంతకన్నా ఎక్కువ ఆదాయముంటే శ్లాబుల వారీగా లెక్కించి ఆ మేరకు పన్ను వేస్తారు.
News February 1, 2025
SSM29 గురించి జక్కన్న చెప్పేది అప్పుడేనా?
మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో తెరకెక్కే SSMB29 షూటింగ్ విజయవాడ సమీపంలో వేసిన సెట్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ నిబంధనల విషయంలో దర్శకుడు చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్నట్లు టాక్. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న జక్కన్న, తర్వాతి షెడ్యూల్ కెన్యా అడవుల్లో ప్లాన్ చేశారని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. అది పూర్తయ్యాక మూవీ టీమ్ గురించి వీడియోలో లేదా ఈవెంట్‌లో వివరించనున్నట్లు సమాచారం.
News February 1, 2025
రామగుండం: అధికారులతో సింగరేణి C&MD వీడియో కాన్ఫరెన్స్
రామగుండం సింగరేణి సంస్థ జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో C&MDబలరాం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానించబడిన అటవీ భూమి మళ్లింపులు, పర్యావరణ క్లియరెన్స్ తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. అధికారులు గోపాల్ సింగ్, ఆంజనేయ ప్రసాద్, కుమార స్వామి, కర్ణ, వీరారెడ్డి తదితరులున్నారు.