News February 1, 2025
సర్వర్ డౌన్.. పింఛన్ పంపిణీకి అంతరాయం

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సర్వర్ సమస్య నెలకొంది. ఉదయం 6 గంటలకు పింఛన్ అందజేసేందుకు అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లగా కొంతసేపు సర్వర్ పనిచేసింది. అనంతరం ‘processing.. please wait’ అన్న ఎర్రర్ కోడ్ వస్తుండటంతో పంపిణీకి అంతరాయం ఏర్పడింది. ఫోన్లో ఆ యాప్ పనిచేస్తేనే పింఛన్ పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం.
Similar News
News November 6, 2025
కడప: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

కడప జిల్లా కొండాపురం మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. తాళ్ల ప్రొద్దుటూరుకు చెందిన బోరు నారాయణరెడ్డి గ్రామం వద్ద బైకుపై రోడ్డు దాటుతుండగా కడప వైపు నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నారాయణరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
News November 6, 2025
మొత్తానికి ట్రంప్‌కు పీస్ ప్రైజ్ వచ్చేస్తోంది!

తరచూ ఏదో ఓ ప్రకటనతో ప్రపంచానికి మనశ్శాంతి దూరం చేస్తున్న ట్రంప్‌కు ఎట్టకేలకు శాంతి బహుమతి రానుంది. నోబెల్ NO అన్న అమెరికా పెద్దన్నను అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ఆదుకుంటోంది. వాషింగ్టన్లో వరల్డ్ కప్ డ్రా వేదికపై ఈ సారి కొత్తగా FIFA Peace Prize ఇస్తామని ప్రకటించింది. FIFA చీఫ్ గయానీ ఫుట్‌బాల్-పీస్ రిలేషన్‌ను అతికిస్తూ వివరించిన ప్రయత్నం చూస్తుంటే ఇది తన శాంతి కోసమే అన్పిస్తోంది.
News November 6, 2025
వేములవాడ: పరిహారం ఇవ్వండి.. లేదా గెజిట్ నుంచి తొలగించండి..!

నష్టపరిహారం చెల్లించకుండా అపరిష్కృతంగా ఉన్న తమ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని రైల్వే లైన్ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు వేములవాడలో నిరసన వ్యక్తం చేశారు. తమ భూములకు వెంటనే పరిహారం చెల్లించాలని, లేదంటే భూములు అమ్ముకునేందుకు వీలుగా గెజిట్ నుంచి తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు. పరిహారం చెల్లించకుండా, గెజిట్ నుంచి తొలగించకుండా తాత్సారం చేయడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.


