News February 1, 2025

పెద్దపల్లి ఎదురుచూస్తోంది.. నిర్మలమ్మ కరుణించేనా?

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం లోకసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై పెద్దపల్లి జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీమల్లికార్జున స్వామి ఆలయానికి ప్రసాద్ పథకంలో నిధులు కేటాయించడం, ఉడాన్ పథకంలో బసంత్ నగర్‌కు చోటు కల్పించడం, రామగుండంలో రైల్వే కోచ్ ఏర్పాటు, PDPLలో పలు రైళ్ల హాల్టింగ్ కల్పించాలని తదితర డిమాండ్లు ఉన్నాయి. 

Similar News

News January 6, 2026

SC, STలకు ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: గొట్టిపాటి

image

AP: సోలార్ రూఫ్ టాప్ పథకానికి టెండర్లు పూర్తి చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ‘సోలార్ రూఫ్‌ టాప్‌కి రూ.78వేల వరకు రాయితీ ఉంటుంది. BCలకు అదనంగా మరో రూ.20వేలు, SC, STలకు ఫ్రీగా ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కేంద్రం కొన్ని రాష్ట్రాల ఇంధనశాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణ అంశంపై చర్చ నిర్వహించింది. దీనికి కూటమి ప్రభుత్వం పూర్తి వ్యతిరేకం’ అని తెలిపారు.

News January 6, 2026

తత్కాల్ టికెట్ బుకింగ్ టిప్.. ఈ ఫీచర్‌తో పని ఈజీ!

image

IRCTCలో తత్కాల్ టికెట్ త్వరగా బుక్ అవ్వాలంటే Master List ఫీచర్ వాడొచ్చు. ‘My Profile’లో ప్రయాణికుల పేర్లు, వయసు, ఆధార్ వివరాలను ముందే సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల బుకింగ్ టైమ్‌లో మళ్లీ టైప్ చేసే పని ఉండదు. కేవలం ఒక్క క్లిక్‌తో ప్యాసింజర్ డీటెయిల్స్ యాడ్ అవుతాయి. టైమ్ ఆదా అవ్వడమే కాకుండా తత్కాల్ సీటు దొరికే ఛాన్స్ పెరుగుతుంది. గరిష్ఠంగా 12 మంది వివరాలను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.

News January 6, 2026

శ్రీకాళహస్తి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం

image

శ్రీకాళహస్తిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అప్పుల బాధలు తట్టుకోలేక సూసైడ్‌కు ప్రయత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు విజయవాడకు చెందిన వెంకటేశ్వర్లు వ్యాపారంలో నష్టపోయి 3 నెలల క్రితం శ్రీకాళహస్తి విచ్చేసి ఓ అద్దె ఇంట్లో భార్య ఉషశ్రీ, కొడుకు సాయి రాజేష్, కుమార్తె దీక్షితతో కలిసి కాపురం ఉంటున్నారు. ఆదివారం అప్పుల వాళ్లు వచ్చి బెదిరించడంతో ఎలుకుల మందు తాగారు.