News March 19, 2024
పోలింగ్ విధులపై అవగాహనతో ఉండాలి: తిరుపతి కలెక్టర్

పోలింగ్ విధులపై అధికారులు పూర్తి అవగాహణ కలిగి ఉండాలని తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అధికారుల సందేహాలను నివృత్తి చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాలన్నారు. లోటుపాట్లు లేకుండా పోలింగ్ విధులకు సిద్ధం కావాలన్నారు.
Similar News
News December 31, 2025
చిత్తూరు జిల్లాలో 1021 సెల్ ఫోన్ల రికవరీ

చిత్తూరు జిల్లాలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని భారీగా సెల్‌ఫోన్లు రికవరీ చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.2.42 కోట్ల విలువైన 1021 ఫోన్లను చాట్ బాట్ ద్వారా పోలీసులు రికవరీ చేశారు. మూడు దశల్లో సెల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు వాటిని బాధితులకు అప్పగించారు. చోరీ అయిన వెంటనే బాధితులు తమ ఫోన్ల కోసం పోలీసులను ఆశ్రయిస్తుండటంతో రికవరీ శాతం పెరిగింది.
News December 31, 2025
చిత్తూరు జిల్లాలో 128 మందిపై డ్రగ్స్ కేసులు

చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది 128 మంది మీద మాదక ద్రవ్యాల చట్టానికి సంబంధించి 42 కేసులను నమోదు చేశారు. 98 కేజీల గంజాయి, 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 35 ఎక్సైజ్ కేసులు నమోదు కాగా.. 327 మందిని అరెస్ట్ చేశారు. 4400 లీటర్ల సారా, 2124 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడింది. 21 వాహనాలను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. 2024తో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది.
News December 31, 2025
చిత్తూరులో సెల్‌ఫోన్ దొంగల అరెస్ట్

చిత్తూరులో సెల్ ఫోన్లు చోరీచేసే ముగ్గురిని అరెస్టు చేసినట్లు రెండో పట్టణ సీఐ నెట్టికంటయ్య వెల్లడించారు. స్థానిక పీవీకేఎన్ కళాశాల వద్ద అనుమానంగా తిరుగుతున్న రాజేష్, లోకేశ్, రాకేశ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనం చేసినట్లు నిర్ధారణ కావడంతో వారి నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి చిత్తూరు జైలుకు తరలించారు.


