News February 1, 2025

నిలిచిపోయిన పెన్షన్ల పంపిణీ?

image

AP: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. సర్వర్‌లో సమస్య రావడంతో పింఛన్ల పంపిణీ ప్రారంభమైన కాసేపటికే నిలిచిపోయినట్లు సమాచారం. సమస్యను పరిష్కరించి పింఛన్ల పంపిణీని కొనసాగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 1, 2025

అద్దె, పింఛన్లపై టీడీఎస్, టీసీఎస్ పరిమితి పెంపు

image

అద్దెలపై విధించే TDS వార్షిక పరిమితిని రూ.2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మల తెలిపారు. ఇక పింఛన్ల వడ్డీపై TDS, TCS మినహాయింపును ప్రస్తుతమున్న రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. ‘LRSపై ఉన్న TCS పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నాం. విద్యాసంబంధిత రుణాల్లో టీసీఎస్‌ను రూ.10 లక్షల వరకూ తొలగించాలని ప్రతిపాదన తీసుకురానున్నాం’ అని స్పష్టం చేశారు.

News February 1, 2025

Income Tax: Rs12.75 లక్షల వరకు ZERO ట్యాక్స్

image

మిడిల్‌క్లాస్, మీడియం రేంజ్ ఎంప్లాయీస్‌కు FM నిర్మలా సీతారామన్ సూపర్ న్యూస్ చెప్పారు. రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై అసలు Income Tax చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. అయితే స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు కలుపుకుంటే ఈ మొత్తం రూ.12.75 లక్షలకు పెరుగుతుంది. అంటే సగటున ప్రతి నెలా రూ.లక్ష జీతం ఉన్నప్పటికీ అస్సలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దీనిపై మీరెలా ఫీలవుతున్నారు? కామెంట్ చేయండి.

News February 1, 2025

కొత్త ఐటీ శ్లాబ్‌లు ఇవే

image

బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మల కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ప్రకటించారు.
*0-4 లక్షల వరకు NIL
*రూ.4 లక్షల-8 లక్షల వరకు 5%
*8 లక్షల-12 లక్షల వరకు 10%
*12 లక్షల-16 లక్షల వరకు 15%
*16 లక్షల- 20 లక్షల వరకు 20 %
*20 లక్షల-24 లక్షల వరకు 25%
*24 లక్షలకు పైగా 30% ట్యాక్స్ ఉండనుంది.