News February 1, 2025

FLASH.. గద్వాల: జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న బస్సు

image

ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో 44 జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒక లారీని ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొంది. వెనకనే వస్తున్న మరో బస్సు ముందున్న బస్సును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ చంద్రశేఖర్ తో పాటు ఆరుగురికి గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 14, 2026

పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని బీ.ఏ., బీ.కామ్, బీఎస్‌సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీఏ(ఎల్) (సీబీసీస్) కోర్సులకు సంబంధించిన II, IV & VI సెమిస్టర్ (రెగ్యులర్/బ్యాక్‌లాగ్/ఇంప్రూవ్‌మెంట్) పరీక్షల నోటిఫికేషన్‌ను పరీక్షల నియంత్రణాధికారి డా కె ప్రవీణ విడుదల చేశారు. విద్యార్థులు పరీక్ష ఫీజు, దరఖాస్తు ఫారమ్‌లను ఈనెల 30 లోపు, రూ.300 ఆలస్య రుసుంతో వచ్చే నెల 4 వరకు తమ కళాశాలల్లో చెల్లించవచ్చని తెలిపారు.

News March 14, 2026

ఒక్కరోజే 2,37,123 గ్యాస్ సిలిండర్ల పంపిణీ

image

TG: డొమెస్టిక్ సిలిండర్ల డెలివరీకి సమస్య రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 2,37,123 గ్యాస్ సిలిండర్లు పంపిణీ అయ్యాయి. సాధారణంగా జరిగే రోజువారీ సగటు పంపిణీ కంటే ఇది 12K సిలిండర్లు అధికం కావడం విశేషం. IOCL 83,166, HPCL 88,257, BPCL 65,700 గ్యాస్ సిలిండర్లను సరఫరా చేశాయి. GOVT కఠిన చర్యల ఫలితంగా బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్టపడింది.

News March 14, 2026

ఖమ్మం ఎంపీకి అంతర్జాతీయ గౌరవం

image

ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్–స్విట్జర్లాండ్ ‘పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్’ సభ్యుడిగా ఆయనను లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేశారు. 18వ లోక్‌సభ కాలానికి గానూ రెండు దేశాల మధ్య పార్లమెంటరీ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ గ్రూపును ఏర్పాటు చేసినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. ఈ నియామకంపై జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.