News February 1, 2025

వరంగల్ పోలీసులకు పతకాలు

image

రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీసులు ఆర్చరీలో రికార్డు సృష్టించారు. ఈ క్రీడలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఏకంగా ఐదు పతకాలను సాధించారు. మూడు బంగారు పతకాలతో పాటు ఒక రజతం, ఒక కాంస్యం పతకాన్ని గెలుచుకున్నారు. ఎస్ఐ అనిల్ వేర్వేరు విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించగా, ఎస్ఐ రాజేందర్, కానిస్టేబుల్ రాహుల్ ఒలింపిక్ విభాగంలో రజతం, కాంస్య పతకాలు సాధించారు.

Similar News

News February 1, 2025

వికారాబాద్: రిటైర్డ్ టీచర్ రామస్వామి మృతి

image

ఉత్తమ ఉపాధ్యాయుడిగా సేవలు అందించిన కొత్తపేట రామస్వామి మృతిచెందడం చాలా బాధాకరమని కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాజేశ్వరమ్మ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో రిటైర్ టీచర్ కొత్తపేట రామస్వామి అనారోగ్యంతో మృతిచెందగా రాజేశ్వరమ్మ పరామర్శించి వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. రాజేశ్వరమ్మ మాట్లాడుతూ.. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

News February 1, 2025

కరీంనగర్: నిర్మలమ్మ పద్దుపైనే ఆశలు..!

image

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం లోకసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై KNR జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి, కరీంనగర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజు నడిచే విధంగా చర్యలు, జిల్లాలో భారత్ మాల పథకంలో జాతీయ రహదారుల విస్తరణ, జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ కల్పించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

News February 1, 2025

‘కాంగ్రెస్ డిఫీట్.. కేసీఆర్ రిపీట్’: జీవన్ రెడ్డి

image

ఈ క్షణంలో ఎన్నికలు జరిగినా ‘కాంగ్రెస్ డిఫీట్.. కేసీఆర్ రిపీట్’ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించుకున్న పోల్ సర్వేలోనే తేటతెల్లమైందని ఆయన శనివారం పేర్కొన్నారు. కేసీఆర్ స్వర్ణ యుగం మళ్లీ రావాలన్నది తెలంగాణ ప్రజల హార్ట్ బీట్ అని ఆయన అభిప్రాయపడ్డారు.