News February 1, 2025
చరిత్ర సృష్టించనున్న నిర్మల
2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ నేడు 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా చరిత్రకెక్కనున్నారు. ఇక మొత్తంగా ఎక్కువ బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన రికార్డు మాజీ పీఎం మొరార్జీ దేశాయ్(10సార్లు) పేరిట ఉంది. ప్రస్తుత కేంద్ర సర్కారుకు ఇంకో నాలుగేళ్ల గడువు ఉండటంతో ఆ రికార్డునూ నిర్మల దాటేందుకు మున్ముందు అవకాశం ఉంది.
Similar News
News February 1, 2025
నేతల మధ్య అంతరాలు లేకుండా చూడాలి: సీఎం
TG: ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పని చేయాలని సీఎం రేవంత్, మంత్రులు నిర్ణయించారు. మంత్రులతో సీఎం నిర్వహించిన అత్యవసర భేటీలో పార్టీ, ప్రభుత్వ అంతర్గత అంశాలపై చర్చించారు. జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అంతరాలు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం సూచించారు.
News February 1, 2025
బడ్జెట్‌లో పోలవరానికి రూ.5,936 కోట్లు
AP: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం సవరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.30,436.95 కోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్‌లో పోలవరానికి రూ.5,936 కోట్లు కేటాయించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి మరో రూ.54 కోట్లు కేటాయించింది. 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వను ఆమోదించింది.
News February 1, 2025
ఏమిటీ శ్లాబుల గజిబిజి
ఇకపై ₹12 లక్షల వరకు పన్ను లేదు.. ₹0-4L 0% పన్ను, ₹4L-8L 5% పన్ను అంటారేంటి అని తికమకపడ్డారా? ₹12L కంటే ఎక్కువ ఆదాయం ఉంటే మొత్తాన్ని శ్లాబులుగా విభజించి పన్ను లెక్కిస్తారు.
Ex: ₹20L (₹75k స్టాండర్డ్ డిడక్షన్): ₹19.25 లక్షలపై పన్ను (మీ 12L పైన ఆదాయాన్నీ ఇలా బ్రేక్ చేయండి)
₹0-4L: 0%
₹4L-8L: 5%= ₹20K
₹8L-12L: 10% = ₹40K
₹12L-16L : 15% = ₹60K
₹16L-20L (₹3.25L): 20% = ₹65K
(₹20L ఆదాయంపై పన్ను ₹1.85L)