News February 1, 2025

HYDలో హృదయవిదారక ఘటన

image

HYDలోని వారాసిగూడ PSపరిధిలో ఇంట్లో <<15323241>>తల్లి మృతదేహంతో ఇద్దరు కూతుర్లు<<>> ఉన్న విషయం తెలిసిందే. అయితే బౌద్ధనగర్‌లోని ఓ ఇంట్లో నివాసముంటూ తల్లి ఇద్దరు కూతుర్లను చూసుకుంటోంది. తండ్రి ఆ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోగా.. గత కొద్దిరోజులుగా తల్లి లలిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో 9 రోజులుగా మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని ఉండిపోగా ప్రస్తుతం ఆ పిల్లలు తల్లిలేక అనాథలయ్యారు.

Similar News

News November 8, 2025

‘అలిపిరి’ అంటే అర్థం మీకు తెలుసా?

image

తిరుపతి నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి కాలినడకన వెళ్లడానికి తొలి ప్రవేశ మార్గం ‘అలిపిరి’. సోపానమార్గంలో కనిపించే తొలి ప్రదేశం ఇదే. ఈ అలిపిరిని కొందరు ‘అడిప్పడి’ అని అంటారు. అడి అంటే అడుగున ఉన్న భాగం. పడి అంటే మెట్టు. తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశమే ఇది. కొందరు దీన్ని అడిప్పుళి అని కూడా అంటారు. పుళి అంటే చింత చెట్టు. అడుగు భాగాన కనిపించే చింతచెట్టు ప్రదేశమని దీని భావం. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 8, 2025

గూగుల్ మ్యాప్స్‌లో ఆర్టీసీ టికెట్ బుకింగ్

image

టికెట్ బుకింగ్ కోసం APSRTC మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లాలో గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేస్తే ఆ రూట్‌లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సులు, జర్నీ టైమ్‌ వివరాలు కనిపిస్తాయి. వాటి మీద క్లిక్ చేస్తే RTC వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. ఈ మేరకు గూగుల్ ప్రతినిధులతో చర్చలు పూర్తయ్యాయి. VJA-HYD మార్గంలో అమలుచేయగా విజయవంతమైంది. త్వరలో అన్ని రూట్లలో మొదలుకానుంది.

News November 8, 2025

కొత్తకోట వద్ద కారు, లారీ ఢీ.. సెక్రటరీ మృతి

image

గద్వాలలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా, కొత్తకోట వద్ద కారు ఆపగా.. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ కారుపై బోల్తా పడింది. కారులో ఉన్న వేముల గ్రామ పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి తీవ్ర గాయాలై, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆ సమయంలో టాయిలెట్ కోసం కిందకు దిగిన ముగ్గురు సెక్రెటరీలు ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు.