News February 1, 2025

గద్వాల: బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టి వెళ్లిపోయారు..!

image

జోగులాంబ గద్వాల జిల్లాలోని రాయచూర్ రోడ్డు మార్గంలో పార్చర్ల స్టేజీ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కేటీదొడ్డికి చెందిన బుడ్డ వీరన్న తన ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈయనను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 6, 2025

నేరవేరనున్న మెదక్ పోలీసుల కల

image

నార్సింగి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న ఫైరింగ్ రేంజ్ పనులను ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించి సలహాలు, సూచనలు చేశారు. ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం వేరే జిల్లా లోని ఫైరింగ్ రేంజ్‌కు వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. ఫైరింగ్ రేంజ్ లేని లోటును త్వరగా పూర్తి చేసి, ఫైరింగ్ రేంజ్‌ను సిబ్బందికి త్వరగా అందుబాటులోకి తేవడానికి కృషి చేయాలని అధికారులకు తెలిపారు. వెంట తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి ఉన్నారు.

News March 6, 2025

సంగారెడ్డి: మండలిలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం: బీజేపీ

image

పట్టభద్రులు, ఉపాధ్యాయులు నమ్మకంతో బీజేపీ అభ్యర్థులు గెలిపించారని, ఈ గెలుపుతో శాసన మండలిలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి బుధవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. రెండు స్థానాలు గెలిపించిన పట్టభద్రులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతామని చెప్పారు.

News March 6, 2025

సంగారెడ్డి: ‘ఇంటర్ పరీక్షలకు 97.5% హాజరు’

image

జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలలో నేడు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 18,852 మంది విద్యార్థులకు గాను 18,296 మంది విద్యార్థులు హాజరయ్యారని (97.5% )ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు. 556 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!