News March 19, 2024
మార్చి 19: చరిత్రలో ఈ రోజు
1952: టాలీవుడ్ నటుడు మోహన్ బాబు జననం
1952: కమెడియన్, మాజీ మంత్రి బాబూ మోహన్ జననం
1955: హాలీవుడ్ నటుడు, నిర్మాత బ్రూస్ విల్లీస్ జననం
1982: ఆచార్య జె.బి.కృపలానీ మరణం
1984: హీరోయిన్ తనుశ్రీ దత్తా జననం
2008: సినీనటుడు రఘువరన్ మరణం
2022: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మరణం
Similar News
News November 25, 2024
మహారాష్ట్ర CM: దేవేంద్ర ఫడణవీస్‌కు నో ఛాన్స్?
అంతా ఊహిస్తున్నట్టుగా దేవేంద్ర ఫడణవీస్‌కు CM పీఠం దక్కకపోవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్రలో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే పార్టీలు మళ్లీ పుంజుకోకుండా వ్యూహాత్మక ఎంపిక ఉంటుందని సమాచారం. ఠాక్రే మరాఠీ, పవార్ మరాఠా అస్థిత్వం ఆధారంగా పార్టీలు నడుపుతున్నారు. ఈ రెండింటినీ న్యూట్రలైజ్ చేసేలా సీఎంను నియమిస్తారని విశ్లేషకుల అభిప్రాయం. మనోహర్, శివరాజ్‌లా కేంద్రంలోకి ఫడణవీస్‌ను తీసుకుంటారన్న వాదనా తెరపైకొచ్చింది.
News November 25, 2024
మధ్యాహ్నం 3గంటలకు CM రేవంత్ ప్రెస్‌మీట్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఫార్మా సిటీపై ప్రతిపక్షాల విమర్శలు, నేడు బీఆర్ఎస్ మహాధర్నా నేపథ్యంలో సీఎం రేవంత్ ఏం మాట్లాడతారనే ఉత్కంఠ నెలకొంది.
News November 25, 2024
రాబిన్ మింజ్ గురించి తెలుసా?
ముంబై ఇండియన్స్ ఝార్ఖండ్‌కు చెందిన విధ్వంసకర బ్యాటర్, కీపర్ రాబిన్ మింజ్‌ను రూ.65 లక్షలకు దక్కించుకుంది. గతంలో మినీ వేలంలో ఇతడిని గుజరాత్ టైటాన్స్ రూ.3.6 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే మెగా టోర్నీకి ముందు బైక్ యాక్సిడెంట్ కావడంతో సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చి దేశవాళీ టోర్నమెంట్లలో అదరగొట్టడంతో ముంబై దృష్టిని ఆకర్షించారు. ఇతడికి ‘ఝార్ఖండ్ గేల్’ అనే పేరు ఉంది.