News February 1, 2025
AY 2025-26: Income Tax రేట్లు ఇవే

కొత్త విధానం: ₹3L వరకు పన్ను లేదు, ₹3L- ₹7L వరకు 5%, ₹7L- ₹10L వరకు 10%, ₹10L- ₹12L వరకు 15%, ₹12L- ₹15L వరకు 20%, ₹15L పైన 30% పన్ను రేటు వర్తిస్తుంది.
పాత విధానం: ₹2.5L వరకు పన్ను లేదు, ₹2.5L- ₹3L వరకు 5%, ₹3L- ₹5L వరకు 5%, ₹5L- ₹10L వరకు 20%, ₹10L పైన 30% పన్ను రేటు వర్తిస్తుంది. వీటికి అదనంగా కొన్ని సెస్సులు ఉంటాయి. రెండు విధానాలకు స్టాండర్డ్ డిడక్షన్, రిబేట్లు వేర్వేరుగా ఉంటాయి.
Similar News
News March 6, 2025
నేడు క్యాబినెట్ భేటీ

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సమగ్ర కులగణనకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చించే అవకాశం ఉంది.
News March 6, 2025
గంటకు 3 లక్షల కి.మీ.. నెలలోపే మార్స్‌పైకి

రష్యా ఓ అద్భుత రాకెట్ ఇంజిన్‌ను ఆవిష్కృతం చేసింది. మార్స్‌పైకి వెళ్లేందుకు అత్యంత వేగవంతమైన ప్లాస్మా ఎలక్ట్రిక్ రాకెట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది గంటకు 3,13,822 కి.మీ వేగంతో నింగిలోకి దూసుకెళ్తుంది. దాదాపు 30 నుంచి 60 రోజుల్లోనే ఇది అంగారకుడిపైకి చేరుకుంటుంది. 2030 నాటికి దీనిని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని రష్యా ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ కార్పొరేషన్ రోసాటామ్ భావిస్తోంది.
News March 6, 2025
హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు?

ఉగ్రవాద సంస్థ హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గాజాలో బందీలుగా ఉన్న అమెరికన్లను విడిపించడం కోసం, ఇజ్రాయెల్‌తో యుద్ధం ముగించడం కోసం ఈ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికన్ ప్రెసిడెన్షియల్ దౌత్యవేత్త ఆడమ్ బోహ్లెర్ నాయకత్వంలో దోహాలో ఈ చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా హమాస్‌ను 1997లో అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.